ఏపీ అధికార పార్టీ వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు ను కూడా కోల్పోయేది లేదని పేర్కొంటూ వచ్చిన వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. సాధారణంగా అభ్యర్థి గెలుపునకు 22 ఓట్లు సరిపోతుండగా.. టీడీపీకి ఇప్పటి వరకు 23 ఓట్లు రావడం గమనార్హం. అదేసమయంలో వైసీపీ అభ్యర్థులకు కేవలం 22 ఇద్దరికి 21 చొప్పున రావడం గమనార్హం.
వాస్తవానికి ఎలాంటి అంచనాలు లేకుండానేటీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ సాహసం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వచ్చాయి. బీసీ సామాజిక వర్గం చేనేత వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధ.. ను చంద్రబాబు బరిలో నిలిపారు. అయితే.. అప్పటికి టీడీపీకి ఉన్నది కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. దీంతో బాబు ప్రయత్నం వృథా అని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా చంద్రబాబు వ్యూహం ఫలించింది. వైసీపీకిగట్టి ఎదురు దెబ్బతగిలిందనే చెప్పాలి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీఅభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి. దీంతో ఆమె గెలుపును ఎవరూ ఆపలేకపోయారనే చెప్పాలి. దీంతో వైసీపీ శిబిరంలో ఎలాంటి సందడీ లేకుండా పోయింది. ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగిందో అని నాయకులు తలపట్టుకుంటున్నారు.
This post was last modified on March 23, 2023 8:36 pm
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…