ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకుంది. పోటీ చేసింది ఒకే ఒక్క అభ్యర్థి అయినప్పటికీ.. గెలుపు గుర్రం ఎక్కడం.. అందునా 22 ఓట్లు వస్తే.. సరిపోతుందని భావించినా.. ఏకంగా 23 ఓట్లు దక్కించుకోవడం.. వంటివి.. టీడీపీ శిబిరంలో భారీ ఎత్తున జోష్ నింపిందనే చెప్పాలి. ఇదంతా.. చంద్రబాబు విజన్‌కు దర్పణంగా నిలిచిందని అంటున్నారు.
వాస్తవానికి ఏమాత్రం అంచనాలు లేకుండానే టీడీపీ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ల నోటిఫికేషన్ మార్చి 2న వచ్చింది. అయితే.. 13వ తేదీ వరకు నామినే షన్లకు అవకాశం ఉంది. అప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ తరఫున సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక, 9వ తేదీ వరకు కూడా.. ఈ ఎన్నికపై అసలు టీడీపీ దృష్టి పెట్టనేలేదు. ఎందుకంటే అప్పటి వరకు టీడీపీకి ఉన్నది కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే.
టెక్నికల్‌గా 23 మంది ఉన్నా.. మిగిలిన నలుగురు కూడా పార్టీకి దూరంగా ఉన్నా.. వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు అసలు దీనిపై దృష్టి పెట్టలేదు. ఇలాంటి సమయంలో కేవలం ఒకే ఒక్క రోజు ముందు.. ఆయన ఆలోచనలకు అనుగుణంగా..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఎందుకు పెట్టకూడదని భావించారు. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధను ఆయన రంగంలోకి దింపారు.
కేవలం ఒక్కరోజు ముందు మాత్రమే నామినేషన్ వేశారు. అదేసమయంలో వైసీపీ వ్యూహాల ముందు కూడా టీడీపీ నిలుస్తుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. మరోసారి బీసీలకు అన్యాయం చేస్తున్నార ని కూడా కొంత వాదన అయితే వినిపించింది. కానీ, ఈ వాదనలు.. చంద్రబాబు విజన్ ముందు నిలవలేక పోయాయి. వైసీపీలో అసంతృప్తులను ఆయన గుర్తించారు. వారితో టచ్‌లోకి వెళ్లారు. ఘన విజయం దక్కించుకున్నారు. మరోసారి బాబు విజన్‌కు తిరుగులేదని అంటున్నారు.
This post was last modified on March 23, 2023 8:31 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…