ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. 151 మంది సొంత ఎమ్మెల్యేలు, అయిదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో 156 మంది బలగంతో ఏడుకు ఏడు ఎమ్మెల్సీ సీట్లూ గెలవాలని వైసీపీ పట్టుదలగా ఉండగా… ఒక్క సీటు తాము గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటేయకుండా టీడీపీ ఆపగలదా… అలాగే వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు తమకు దెబ్బేయకుండా వైసీపీ ఆపగలదా అనేది చర్చనీయమవుతోంది.
నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి వంటి టీడీపీ నేతలు ఏకంగా 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ఓటేస్తారని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే… అసంతృప్తి అనేదే లేదంటూ వచ్చిన వైసీపీ అధిష్ఠానం ఇప్పుడు తగ్గి మాట్లాడుతోంది. అసంతృప్త నేతలతో మాట్లాడామని.. వారు తమకే ఓటేస్తారని చెప్తోంది.
వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఆత్మ ప్రబోధానుసారం టీడీపీకి ఓట్లు వేస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ తెలుగుదేశం చరిత్ర సృష్టిస్తుoదని టీడీపీ పోలింగ్ ఏజెంట్ నిమ్మల రామానాయుడు అన్నారు.తెలిపారు. అంతరాత్మ ప్రభోదానుసారావు వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ఓటు వేయబోతున్నారన్నారు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న 16మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోనే ఉన్నారని అన్నారు.
పట్టభద్రుల ఎన్నిక తర్వాత వైసీపీ నాయకులకు రాష్ట్రంలో ప్రజల మనసు అర్థమైందని.. అందుకే వారు టీడీపీకి జైకొడుతున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. సీక్రెట్ ఓటింగ్‌లో ఎవరు ఎవరికి వేశారో తెలిసే అవకాశం లేకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు టీడీపీకి ఓటేయనున్నట్లు చెప్తున్నారు. వైసీపీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయని… అందుకే అభద్రతా భావనలో జగన్ క్యాంపులు పెట్టుకున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మీద అసంతృప్తితో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో మాట్తాడారని… వారు టీడీపీకి ఓటేస్తారని చెప్పారు.
This post was last modified on March 23, 2023 1:03 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…