ఎవరి పంచాంగం వారిదే. ఎవరి భవిష్యత్తు వారిదే. శోభకృత్ నామ నూతన ఉగాది సంవత్సరం రోజు అన్ని పార్టీలూ ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ నిర్వహించిన ఉగాది వేడుకలు హైలెట్‌గా నిలిచాయి. పంచాంగ కర్త మాట్లాడుతూ.. ఈ ఏడాది సైకిల్ దూసుకెళ్తుందన్నారు. ప్రజల్లో నారా లోకేష్‌కు మంచి గుర్తింపు వస్తుందని, చంద్రబాబు.. చంద్రుడు.. ఇంద్రుడై.. చక్రం తిప్పుతారని వెల్లడించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షానికి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని పంచాంగ పఠనంలో వెల్లడించారు. మరో కీలక విషయం ఏంటంటే.. వైసీపీ పటాపంచలు అయి.. తనంతట తనే కుప్పకూలుతుందని పఠన కర్త వెల్లడించారు. మొత్తానికి ఉగాది టీడీపీలో జోష్ నింపింది.
ప్రజాస్వామ్యం కోసమే నా ఆరాటం: చంద్రబాబు
ఉగాది పంచాంగం పఠనం అనంతరం.. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను ప్రజలు తిప్పికొట్టారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. పదవుల్లో శాశ్వతంగా ఉండటానికి ఇది రాచరికం కాదని పరోక్షంగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్యం కోసం పోరాడతామని, ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని బాబు స్పష్టం చేశారు.
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో కష్టాలే ఉన్నాయని, శోభకృత్ సంవత్సరంలో శుభాలే జరుగుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు వెలుగు రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి.. టీడీపీకి ఓట్లేశారన్నారు. అరాచకానికి కూడా ఓ పద్దతి.. ఓ విధానం ఉంటుందని.. కానీ గత 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశానని.. ప్రశ్నించిన పేదలపై దాడులు జరిగాయని అన్నారు. అధికార పార్టీ ఆశలు ఇక సాగవని పంచాంగంలో కూడా చెప్పారన్నారు.
ధరలు పెరిగాయి.. పన్నులు పెరిగాయి.. ప్రజలపై భారం పడిందని చంద్రబాబు అన్నారు. ధరలు పెరుగుదలపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. “పంచాంగం ఓ డెరెక్షన్ ఇస్తుంది.. సూచన ప్రాయంగా సంకేతాలిస్తుంది.. పంచాంగం ఎంతో శాస్త్రోక్తంగా రాస్తున్నారని.. అస్ట్రాలజీ కూడా సైన్సేనని.. ప్రజలు జాగ్రత్త పడడానికి పంచాంగం ఎంతో ఉపయోగపడుతుంది” అని చంద్రబాబు చెప్పారు. తెలుగు జాతి అనేక రంగాల్లో రాణిస్తోందని, నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారి ప్రతిష్ట పెరిగిందన్నారు. ఉగాదికి.. టీడీపీకి దగ్గర సంబంధం ఉందని.. తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారని చంద్రబాబు స్పష్టం చేశారు.
This post was last modified on March 23, 2023 6:55 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…