ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. నేనేంటో నిరూపించుకుంటా!
అని దాదాపు ఆరు సంవత్సరాలుగా ఒక యువ నాయకురాలు చంద్రబాబుకు మొర పెట్టుకుంటున్న విషయం తెలుసా? అవును సార్.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి తనను తాను నిరూపించుకుంటుంది. పార్టీనే నమ్ముకున్నాం. ఈసారి గెలుపు ఖాయం
స్వయంగా ఆ యువ నాయకురాలు మాతృ మూర్తి సైతం చంద్రబాబుకు విన్నవించి.. దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. అయినప్పటికీ.. చంద్రబాబు ఇప్పటి వరకు వీరిని పట్టించుకోలేదు. సర్వేలు… సమాచారం.. పేరుతో ఇంకా నానుస్తూనే ఉన్నారు.
ఆమే.. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ. ఎప్పటి నుంచో ఈ కుటుంబం రాజాం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ, ఇప్పటి వరకు చంద్రబాబు కరుణించలేదు. కనీసం.. ఇస్తామని కానీ.. ఇచ్చేది లేదని కానీ… వారికి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు.. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు గ్రీష్మ వైపు.. వైసీపీ నేతలు మొగ్గు చూపుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది నిజం కూడా! ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్లిందని కూడా ఉండవల్లి వర్గాలు అంటున్నాయి.
అయినప్పటికీ.. చంద్రబాబు పెద్దగా స్పందించలేదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాజాం నియోజకవర్గం నుంచి 2009లో గెలుపు గుర్రం ఎక్కిన అప్పటి కాంగ్రెస్ నేత కోండ్రు మరళీ మోహన్ విజయం దక్కించుకున్నారు.
2014 ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ.. 2019 ఎన్నికల నాటికి ఆయన పార్టీలోకి వచ్చారు. ఈయనకు మాజీ మంత్రి కళా వెంకట్రావు మద్దతు ఉందనే ప్రచారం ఉంది. దీంతో కావలి కుటుంబాన్ని పక్కన పెట్టి కోండ్రుకు గత ఎన్నికల్లో చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. అయితే.. ఆయన ఓడిపోయారు. పోనీ.. పార్టీలో అయినా యాక్టివ్‌గా ఉన్నారా? అంటే.. అది కూడా లేదు. కోండ్రుతో పోల్చుకుంటే.. గ్రీష్మ దూకుడుగా ఉన్నారు. మహానాడులోనూ తొడగొట్టి మరీ వైసీపీ నేతలకు సవాళ్లు రువ్వారు. అలాంటి నాయకురాలి విషయంలో చంద్రబాబు ఎందుకో ఆలోచనలో పడ్డారు.
ఇదిలావుంటే, వైసీపీ వ్యూహాత్మకంగా కావలి కుటుంబానికి ఎర వేస్తున్నట్టు సమాచారం. గ్రీష్మకు నామినేటెడ్ పదవిని, ప్రతిభా భారతికి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చేందుకు వైసీపీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులుకు వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో వీరిని పార్టీలోకి ఆహ్వానించి సదరు వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్టు టీడీపీలో చర్చ సాగుతోంది. అయినా.. చంద్రబాబు మాత్రం మౌనంగా ఉన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 3, 2023 7:07 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…