రాయలసీమలో సాగుతున్న లోకేశ్ పాదయాత్రకు ఆ ప్రాంతంలో మంచి స్పందన కనిపిస్తోంది. అదే సమయంలో పాదయాత్రలో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వివిధ రంగాలకు చెందినవారు లోకేశ్ పాదయాత్రలో అడుగు కలుపుతున్నారు. పనిలో పనిగా టికెట్లు ఆశిస్తున్న కొత్తవారు కూడా లోకేశ్ దృష్టిలో పడేందుకు, లోకేశ్‌ను కలిసేందుకు పాదయాత్రను వేదికగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే పాదయాత్రలో లోకేశ్ తో పాటు కలిసి నడుస్తున్నారు.
అయితే, లోకేశ్ పాదయాత్రలో కనిపిస్తున్న కొత్తవారిని చూసి పాత నేతలు, సిటింగ్ ఎమ్మెల్యేలు, గతసారి పోటీ చేసి ఓడిన నేతలు కాస్త కంగారు పడుతున్నారు. కొత్తగా పార్టీలోకి రావాలని చూసేవారు తాము టికెట్ ఆశించే నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలపై ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారని.. అక్కడి సమస్యలను లోకేశ్ ముందు పెట్టి తమకు చాన్సొస్తే ఏం చేస్తామో చెప్తున్నారని.. ఇదంతా తమకు ఎసరు పెట్టే కార్యక్రమమని సిటింగులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే కొన్ని నియోకజవర్గాలలో గ్రూపులు, టికెట్ల కోసం వర్గపోరు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో కొత్తవారు దొరికితే పార్టీని వారిని ఎంచుకునే ప్రమాదముందని పాత నేతలు టెన్షన్ పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో డబ్బు సంపాదించినవారు, హైదరాబాద్ బెంగళూరు కేంద్రంగా ఇతర వ్యాపారాలు చేసి ఎన్నికల్లో పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నవారు, అధికారులుగా పనిచేసి రిటైరైన వారు, ఉద్యోగంలో ఉన్నా టికెట్ హామీ దొరికితే వీఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నవారు లోకేశ్‌ను కలుస్తున్నారు.
పాదయాత్ర మార్గంలో వెలుస్తున్న ఫ్లెక్సీలలోనూ కొత్త ముఖాలు కనిపిస్తుండడంతో స్థానిక నేతలు వాటిని తొలగిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. ముఖ్యంగా పాదయాత్ర ముగిసిన తరువాత నారా లోకేశ్‌తో భేటీ అవుతున్నవారిలో ఎక్కువగా టికెట్లు ఆశిస్తున్నవారు ఉంటున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఔత్సాహికుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
This post was last modified on March 26, 2023 7:23 am
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…