Political News

జ‌న‌సేన‌ తో న‌ష్ట‌పోయాం: బీజేపీ హాట్ కామెంట్స్‌

ఏపీలో నిన్న‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌-బీజేపీ పొత్తుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ నాయ‌కులు.. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ భారీగా న‌ష్ట‌పోవ‌డంతో(ఉత్త‌రాంధ్ర సిట్టింగ్ స్థానం బీజేపీ కోల్పోయింది) జ‌న‌సేన‌తో పొత్తుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆపార్టీ అధికార ప్ర‌తి నిధి.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక పోయిన‌.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ పీవీఎన్ మాధ‌వ్ తీవ్ర‌స్థాయిలో హాట్ కామెంట్స్ కుమ్మ‌రించారు. జ‌న‌సేన‌తో న‌ష్ట‌పోయామ‌న్నారు. ఏదో పేరుకే తాము జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్నామ‌ని తీవ్ర నిర్వేదం వ్య‌క్తం చేశారు.

జనసేనతో పేరుకే పొత్తు అనే పరిస్థితి ఉండటం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం జరిగిందని.. మాధవ్‌ అన్నారు. ఎమ్మెల్సీ పోరులో జనసేన మద్దతిస్తున్నట్లు పీడీఎఫ్‌ ప్రచారం చేసుకున్నా, పవన్‌కల్యాణ్‌ సహా ఆ పార్టీ నేతలు ఖండించలేదన్నారు. ఈ విషయాన్ని జనసేన దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. రెండు పార్టీలు కలిసి సాగాలనుకుంటే… క్షేత్రస్థాయిలో కలిసి కార్యక్రమాలు చేస్తేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందన్నారు. కానీ, ఆ ప‌రిస్థితి జ‌న‌సేన వైపు నుంచి రావ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

మిత్రపక్షంగా తాము జనసేనతో కలిసి ఉన్నా లేనట్టే ఉందని మాధవ్‌ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము కోరినప్పటికీ జనసేన నుంచి ఎక్కడా ఎలాంటి ప్రకటన, మద్దతు లభించలేదని ఆయన వ్యాఖ్యానించారు. పీడీఎఫ్‌ అభ్యర్ధులకు జనసేన మద్దతు ఉందని జరిగిన ప్రచారాన్ని సైతం ఖండించలేదని పేర్కొన్నారు. బీజేపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదనేది వాస్తవమని అంగీకరించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పినట్టు ఇరుపార్టీ కార్యకర్తుల కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

ఈ దిశగా పవన్‌ కల్యాణ్‌, మనోహర్‌ ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు. లేకపోతే పేరుకే ఈ రెండు పార్టీల పొత్తు అని జనం అనుకుంటారన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా టీడీపీకి పడిందని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ ఆశిస్తోన్న రోడ్ మ్యాప్ అంటే.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడమేనని మాధవ్‌ తెలిపారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు మంచి అవకాశం ఉందని… మచిలీపట్నం సభకు వచ్చిన జనాన్ని అంతా చూశారని… ఇరు పార్టీలు కలిసి పోరాటాలు చేస్తే.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. మొత్తానికి బీజేపీకి ఇప్ప‌టికి జ‌న‌సేన విలువ తెలిసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 21, 2023 9:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీఐడీ చేతికి పోసాని కేసు

వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…

5 mins ago

సౌత్‌ హీరోల్లో ఉన్న ఐకమత్యం మాలో లేదు – అక్షయ్, అజయ్

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…

18 mins ago

మళ్ళీ బిగ్ బ్రేక్ ఇచ్చేసిన రాజమౌళి..

మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…

1 hour ago

ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ వైభవ్?

ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…

2 hours ago

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు…

2 hours ago