కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యే ముందు తాను గతంలో వాడిన ఫోన్లను మీడియాకు చూపించారు. ఈడీ ఆరోపించినట్టు తాను ఫోన్లు ధ్వంసం చేయలేదంటూ మీడియా ముందు ఆ ఫోన్లను ప్రదర్శించారు. ఈడీ కార్యాలయంలో విచారణకు వెళ్లే ముందు కార్యాలయం బయట కారులోంచి బయటకు నిల్చున్న ఆమె రెండు పాలిథీన్ కవర్లలో తన పాత ఫోన్లన్నీ ఉంచి వాటిని చూపించారు. వీటిని తాను ధ్వంసం చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది… కానీ, అవన్నీ తనతోనే ఉన్నాయంటూ వాటిని ఈడీకి అప్పగిస్తున్నాని చెప్పారు. ఈ మేరకు ఆమె వాటిని అప్పగిస్తూ ఈడీకి లేఖ కూడా రాశారు.
లిక్కర్ కుంభకోణం లావాదేవీలు మాట్లాడిన ఫోన్లను కవిత ధ్వంసం చేశారంటూ ఈడీ గతంలో పలు రిమాండ్ రిపోర్టుల్లో ఆరోపణలు చేసింది. కవిత తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారంటూ ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించాయి. దీంతో కవిత ఇవాళ తాను ఫోన్లు ధ్వంసం చేయలేదు అనడానికి సాక్ష్యంగా ఆ ఫోన్లను మీడియాకు చూపించి వాటిని ఈడీకి విచారణ నిమిత్తం అప్పగించారు. ఈ సందర్భంగా ఈడీకి రాసిన లేఖలో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
‘ఫోన్లు ధ్వంసం చేశాను అంటూ నాపై దారుణమైన ఆరోపణలు చేశారు. మీరు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను మీకు సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? అసలు నన్ను విచారించకుండానే నేను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఈ ఆరోపణలు ఎలా చేసింది? నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కదా.
తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం’’ అని తన లేఖలో ఆరోపించారు కవిత.
కాగా నిన్నటి విచారణ ముగింపు సమయంలో కవితకు వైద్య పరీక్షలు చేశారు. కవిత తరఫు న్యాయవాదులు కూడా అక్కడకు చేరుకున్నారు. నిన్ననే ఆమెను అరెస్ట్ చేస్తారని భావించినప్పటికీ నిన్న అరెస్ట్ చేయలేదు. ఈ రోజు మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఆమె అరెస్ట్ ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈడీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on March 21, 2023 12:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…