ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత మూడో సారి విచారణకు హాజరయ్యారు. వరుసగా రెండో రోజున ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు , ఈడీ కార్యాలయం లోపలికి వెళ్తున్నప్పుడు ఆమె ప్లాస్టిక్ కవర్లో ఉంచిన ఫోన్లను మీడియాకు చూపించారు. రెండో చేతుల్లోని రెండు కవర్లలో ఫోన్లు ఉండగా నవ్వుతూ వాటిని ఆమె మీడియాకు చూపించారు. కవిత వెంట భర్త అనిల్ కూడా ఈడీ కార్యాలయం వరకు వెళ్లారు.
పది ఫోన్లు ధ్వంసం !
నిజానికి ఈడీ, సీబీఐ రెండు సంస్థలు కవిత, సిసోడియా సహా అందిరిపైనా పలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. అందులో ఒకటి స్కాం జరిగినప్పుడు వాడిన ఫోన్లను ఆమె ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. వరుస ఛార్జ్ షీట్లు, రిమాండ్ రిపోర్టల్లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించాయి. కవిత ఒక్కరే పది ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ మనీష్ సిసోడియా రిమాండ్ ఎక్స్ టెన్షన్ రిపోర్టులో పొందుపరిచింది.
ఈ ఫోన్లేమింటి..
ఈడీ చెప్పిందే నిజమైతే మంగళవారం ఈడీ ఆఫీసుకు బయలుదేరుతూ కవిత ప్రదర్శించిన సెల్ ఫోన్లు ఎక్కడివి, అవి ఎవరివి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫోన్లు ధ్వంసం చేశారా లేదా.. కవిత ప్రస్తుతం చూపిస్తున్న ఫోన్లు, ఈడీ రిమాండ్ రిపోర్టులో ఉన్న ఫోన్లు ఒకటేనా అన్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు. నిజంగా ఫోన్లు ధ్వంసం చేయకపోతే ఈడీ ఎందుకులా ఆరోపిస్తోంది అనేది పెద్ద ప్రశ్న. వీటికి కవిత లేదా ఈడీ మాత్రమే సమాధానం చెప్పగలరు..
నేషనల్ ఫిగర్..
కవితకు ఉన్న అతి పెద్ద క్వాలిఫికేషన్ కేసీఆర్ కూతురు కావడమే. ఆమె ఎమ్మెల్సీ మాత్రమే. తెలంగాణ జాగృతి అయినా భారత జాగృతి అయినా పెద్దగా పబ్లిసిటీ లేని సంస్థ. దాని గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మాత్రం కవిత జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. తెలుగే కాదు… ఇంగ్లీష్, హిందీ మీడియా కూడా కవిత వైపే చేస్తోంది. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తోంది. దీనితో కేసు ఎలాగున్నా కవితకు ఉచితంగా జాతీయ స్థాయి పబ్లిసిటీ వచ్చింది. జనం ఆమె గురించి చర్చించుకునే అవకాశం లభించింది. అదీ పాజిటివ్ పరిణామమే కదా..
This post was last modified on March 21, 2023 4:03 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…