బీఆర్ఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి అధిష్టానానికి దగ్గర, నియోజకవర్గానికి దూరం అన్నట్లుగా ఉంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌ను వీడడంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఎలాగైనా ఈటలను ఓడించాలన్న లక్ష్యంతో కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారు. ఆయనకు హుజూరాబాద్ టికెట్ ఇవ్వనప్పటికీ ఎమ్మెల్సీని చేశారు. దాంతో ఎమ్మెల్యేగా గెలవలేని కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేసీఆర్ తనను అసెంబ్లీలో అడుగుపెట్టిందచినందుకు కృతజ్ఞతగా ఆయన నిత్యం తన నోటికి పని చెప్తూ ఈటల, ఇతర బీజేపీ నేతలు, చివరకు గవర్నరుపైనా విమర్శలు చేస్తుంటారు. ఆ దూకుడు చూసే కేసీఆర్ ఆయనకు ఇటీవల ప్రభుత్వ విప్ పదవి కూడా ఇచ్చారు.
అయితే.. ప్రభుత్వ విప్ పదవి చేపట్టిన తరువాత తొలిసారి తన సొంతూరు జమ్మికుంటకు వచ్చారు కౌశిక్ రెడ్డి. అక్కడ పోచమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై బోనం ఎత్తుకున్నారు. విప్ కౌశిక్రెడ్డి వెంట జమ్మికుంట జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, పలువురు వీణవంక ప్రాంతానికి చెందిన నేతలు తప్ప జమ్మికుంట, హుజురాబాద్, ఇల్లందకుంట, కమలాపూర్ ప్రాంతానికి చెందిన నేతలు ఎవరు కూడా విప్కు స్వాగతం పలకడానికి కూడా రాలేదు. దీంతో కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారట.
కాంగ్రెస్ నుంచి తనతో పాటు బీఆర్ఎస్‌లోకి వచ్చిన వారిని తప్ప ముందు నుంచి బీఆర్ఎస్‌లో ఉన్న స్థానిక నాయకులను కౌశిక్ రెడ్డి పట్టించుకోవడం లేదట. నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపాలిటీలలో కో ఆప్షన్ సభ్యులు, దేవాలయ కమిటీలు, పార్టీ పదవులు వంటి సుమారు 200 పదవులు నామినేట్ చేయడానికి ఉన్నా కౌశిక్ రెడ్డి చొరవ చూపడం లేదని అయన స్వార్థమే చూసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు బాహటంగానే విమర్శలు చేస్తున్నారు.
తాము మొదటి నుంచి గులాబీ జెండా మోసినవాళ్లమని.. మొన్నమొన్నటి వరకు బీఆర్ఎస్‌ను తిట్టిపోసిన కౌశిక్ ఇప్పుడు పార్టీలో అంతా తానే అన్నట్లుగా మారి తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. చూడబోతే కోరి తెచ్చుకున్న కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ బీఆర్ఎస్‌ను ఖాళీ చేసేలా కనిపిస్తున్నారంటున్నారు ఆ పార్టీ నేతలు.
This post was last modified on March 20, 2023 11:09 pm
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…