Political News

వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు.. ఏపీ అసెంబ్లీని కుదిపేస్తున్నాయా?

ఏపీ అసెంబ్లీలో ప్ర‌జాస‌మ‌స్య‌లు ప్ర‌స్తావించి.. వాటిని ప‌రిష్క‌రించేందుకు మార్గాలు వెత‌కాల్సిన అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌భ్యుల మ‌ధ్య వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు చోటు చేసుకుంటున్నాయా? త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌తంలో జ‌రిగిన గొడ‌వ‌ల‌ను.. వారి మ‌ధ్య ఉన్న ప‌గ, క‌క్ష‌, కార్ప‌ణ్యం వంటివాటిని స‌భ‌లో ప్ర‌స్ఫుటీక‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

శాస‌న స‌భ ఉన్న‌ది మీ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు చ‌ర్చించుకునేందుకు కాదు. ప్ర‌జలు మిమ్మ‌ల్ని ఎన్నుకున్న ది వారి స‌మ‌స్య‌ల‌పై మీరు చ‌ర్చిస్తార‌ని. అంతేకాదు.. మీరే ఒక స‌మ‌స్య‌గా మారి.. చ‌ర్చ‌కు కేంద్రం అవుతార‌ని కాదు– తొలి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌శాస‌న స‌భ‌కు సార‌థిగా ఉన్న అయ్య‌దేవర కాళేశ్వ‌ర‌రావు అన్న అమృత వాక్కులు ఇవి! కానీ, ఈ వ్యాఖ్య‌లు ఆనాడే అంత‌రించిపోయాయి.

ఎవ‌రికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ ఒక అజెండా ఏర్పాటు చేసుకుని.. స‌భ‌లో సంప్ర‌దాయాల‌ను మంట‌గ‌లిపేలా వ్య‌వ‌హ‌రిస్తుండడం.. ఒక్క ఏపీ అసెంబ్లీలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా చ‌ట్ట‌స‌భ‌ల్లో క‌నిపిస్తున్న ప‌రిణామం. ఫ‌లి తంగా ప్ర‌జాస్వామ్యం భ్ర‌ష్టు ప‌ట్టిపోతోంద‌ని చెబుతున్న విమ‌ర్శ‌కుల మాట‌ల్లో అంత‌రార్థాన్ని కాద‌న‌గ‌లిగే నాయ‌కుడు, ఖండించే పార్టీకూడా లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం.

నువ్వు ఒక‌ట‌ను.. నేరెండంటా. స‌భ వాయిదా ప‌డిపోతుంది! నిరుడు త్రిపుర అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష‌, అధికార ప‌క్ష స‌భ్యులు చేసుకున్న ఒప్పందం తాలూకు ఫోన్ ఆడియోలు వెలుగు చూసి.. దేశంలో ప్ర‌కంప‌న‌లు సృష్టించినా.. ప్ర‌శ్న‌ల‌కు డ‌బ్బులు తీసుకుంటున్నారంటూ.. సాక్షాత్తూ పార్ల‌మెంటులోనే డ‌బ్బుల క‌ట్ట‌లు బ‌య‌ట‌కు చూపించినా.. చ‌ర్య‌లు తీసుకున్న నాధుడు క‌నిపించ‌లేదు.

ఫ‌లితంగా.. ప్ర‌జాసమ‌స్య‌లకు, ప్రజాభ్యుద‌యానికి వేదిక‌లుగా త‌ల‌మానికంగా ఉండాల్సిన చ‌ట్ట‌స‌భ‌లు వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌కు.. క‌క్ష‌ల‌కు.. కీల‌క వేదిక‌లుగా మారుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో ఈ పోకడ ఇప్పుడు కొత్త‌కాదు. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో జ‌గ‌న్ కూట‌మి, ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో చంద్ర‌బాబు కూట‌మి కూడా అలానే చేస్తోంది.

ఎవ‌రు అధికారంలో ఉంటే.. వారు ఎదుటివారిపై నింద‌లు వేస్తున్నారే త‌ప్ప‌.. వాస్త‌వానికి స‌భకు ఒక సంప్ర‌దాయం ఉంద‌ని.. దానిని గౌర‌వించాల‌నే క‌నీస స్పృహ‌ను కూడా కోల్పోతున్నారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల్సింది.. ప్ర‌జ‌లే. అది కూడా త‌మ ఓటుతోనే!!

This post was last modified on March 20, 2023 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

1 hour ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

3 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

4 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

4 hours ago

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

6 hours ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

6 hours ago