“ఫోటో” మీద ఏపీ ముఖ్యమంత్రికి అంత ఆసక్తి ఏమిటి? తన ఫోటోను అందరూ ఏదో విధంగా వాడాలన్న తాపత్రయం ఆయనకు అంత ఎక్కువ ఏమిటి? పార్టీ జెండా రంగు పోలి ఉండేలా బడిని.. ప్రభుత్వ కార్యాలయాలకు వేయించి.. కోర్టు చేత చీవాట్లు తిన్న ఏపీలోని వైసీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఫోటోను ప్రముఖంగా కనిపించేందుకు ఉండే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టని వైనం తెలిసిందే.
ప్రతి ఇంటి మీద తన ఫోటోతో కూడిన స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని భారీగా చేపట్టిన ఆయన.. ఒక దశలో ఇంటింటికి సర్వే నిర్వహించే అధికారులు.. ప్రభుత్వ పథకాల లబ్థిదారుల సెల్ ఫోన్లకు ముఖ్యమంత్రి జగన్ ఫోటోను స్టిక్కర్ రూపంలో అంటించే కార్యక్రమం చేపట్టటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా అమలు చేస్తున్న మరో కొత్త విధానంపై విస్మయం వ్యక్తమవుతోంది. దేశంలో మరెక్కడా లేని రీతిలో అమలు చేస్తున్న ఈ తీరును చూసిన వారంతా నోళ్లు నొక్కుకునే పరిస్థితి.
ఇంతకూ ఈ కొత్త విధానం ఏమంటే.. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు భద్రత కల్పించే పోలీసులు అధికారులకు.. డ్యూటీ పాసులు ఇవ్వటం తెలిసిందే. ఈ డ్యూటీ పాసుల్లోనూ ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో కూడిన విధంగా తయారు చేయటం.. వాటిని ప్రతి ఒక్కరూ ధరించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటం చూస్తే.. ప్రభుత్వ ఉద్యోగులు అందునా పోలీసులు తమ స్వామిభక్తీని ప్రదర్శించుకోవాలన్నట్లుగా సీఎం ఫోటోలతో ఐడీలు సిద్ధం చేయటం ఏమిటంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా డ్యూటీ పడిన పోలీసు అధికారుల నుంచి సాధారణ పోలీసుల వరకు విధులు నిర్వహించే వారందరిక డ్యూటీ పాసులను అందజేశారు. ఈ కార్డుల్లో సీఎం జగన్ ఫోటో ఉండటంతో వారు అవాక్కు అయ్యారు. కానీ. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో వాటిని ధరించక తప్పలేదు. ఎన్నో ఏళ్లుగా సర్వీసులో ఉన్నామని.. కానీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఫోటోతో ఉన్న ఐడీ కార్డుల్ని ధరించింది లేదని వాపోతున్నారు. రానున్న రోజుల్లో సీఎం జగన్ ఫోటోలతో మరెన్ని సిత్రాలు చూడాల్సి వస్తుందో అన్న మాట వినిపించటం విశేషం.
This post was last modified on March 20, 2023 1:48 pm
పుష్ప విలన్ గా మనకు బాగా దగ్గరైన మలయాళ హీరో ఫాహద్ ఫాసిల్ తో బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా…
ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ దాదాపుగా ఏడాదికి పైగానే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నారు. దువ్వాడకు సంబంధించి…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణానికి సంబంధించిన గుట్టు దాదాపుగా వీడిపోయినట్టేనని చెప్పాలి. ఈ వ్యవహారంలో కీలక భూమిక…
మే 1 విడుదలవుతున్న రెండు సినిమాలు హిట్ 3 ది థర్డ్ కేస్, రెట్రో దేనికవే ప్రత్యేక అంచనాలతో ప్రేక్షకుల…
ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో అరెస్టైన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి.సీతారామాంజనేయులు…
విశ్వంభర సంగతేమో కానీ చిరంజీవి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎగ్జైటింగ్ ప్రాజెక్టుల్లో ముందు వరసలో ఉన్న సినిమా దర్శకుడు శ్రీకాంత్…