Political News

అసెంబ్లీలోనే టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి

ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకునేందుకు య‌త్నించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తనపై దాడి చేసినట్లు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కాగా.. స‌భ అదుపు త‌ప్ప‌డంతో 11 మంది టిడిపి స‌భ్యుల‌ను స్పీక‌ర్ స‌భ నుంచి స‌స్సెండ్ చేసి అసెంబ్లీని వాయిదా వేశారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల స్థానాలన్నిటిలోనూ టీడీపీ గెలవడంతో ఆ ఫ్రస్టేషన్‌తోనే వైసీపీ నేతలు ఇలా అసెంబ్లీలో దాడి చేశారన్న విమర్శలు జనం నుంచి వస్తున్నాయి.

సోమవారం ఉదయం సభ ప్రారంభమైన తరువాత జీవో నంబర్ 1 రద్దు చేయాలని కోరుతూ టీడీపీ సభ్యులు తీర్మానం ప్రవేశం పెట్టారు. దీనిని స్పీక‌ర్ తిర‌స్క‌రించారు..ఈ సంద‌ర్భంగా టిడిపి స‌భ్యులు ప్ల‌కార్డుల‌తో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు.

వారు నిరసన చేస్తుండగా వైసీపీకి చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు వారి దగ్గరకు దూసుకొచ్చారు. అక్కడున్న కొండపి ఎమ్మెల్యే డోల బాలాంజనేయ స్వామి, మరో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో ఘర్షణకు దిగారు. వారి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది.. ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది.. ఇంతలో మాజీ మంత్రి, వైసీపీ నేత వెల్లంపల్లి కూడా అక్కడకు వచ్చి వాదనకు దిగారు. ఈ ఘర్షణలో బుచ్చ‌య్య చౌద‌రి కింద‌ప‌డిపోయారు. సభ అదుపు త‌ప్ప‌డంతో టిడిపి స‌భ్యుల‌ను సస్పెండ్ చేసిన స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు.

కాగా సంతనూతలపాడు ఎమ్మెల్యే తనపై దాడి చేశారంటూ కొండపి ఎమ్మెల్యే బాలాంజనేయ స్వామి ఆరోపించారు. అలాగే వెల్లంపల్లి తనపై దాడి చేశారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. అయితే… టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకరుపై దాడికి ప్రయత్నించడంతోనే వారిని అడ్డుకున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘర్షణ తరువాత టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సీతారాం సస్పెండ్ చేశారు.

This post was last modified on March 20, 2023 10:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

2 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

2 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

4 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

4 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

5 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

6 hours ago