ఇప్పటి వరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలను సరిగా పట్టించుకోలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఇప్పు డు వారికి భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇటీవల తమ గోడు వినిపించుకోవడం లేదని, నియోజకవర్గంలో కనీసం తమను పట్టించుకో వడం లేదని.. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. మద్దిశెట్టి వేణుగోపాల్ వంటి వారు బాహాటంగానే ఆరోపణలు చేసి న విషయం తెలిసిందే. వీరిలో కోటంరెడ్డి ఏకంగా తిరుగుబావుటా ఎగుర వేశారు. అంటే.. ఈ నాలుగేళ్లలో తన పార్టీ ఎమ్మెల్యేలనే వైసీపీ పట్టించుకోలేదన్నమాట.
కానీ.. ఇప్పుడు వైసీపీ అధిష్టానం తన ఎమ్మెల్యేలను లైన్‌లో పెడుతోంది. వారికిఏం కావాలో కనుక్కోండి! అని కీలక మంత్రుల కు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గం అభివృద్ధా..? నిధులా? ఏది కావాలన్నా చేద్దాం అని సీఎం జగన్ తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందునే! ఈ కోటాలో ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
పట్టభద్రులు ఎమ్మెల్సీలో వైసీపీకి చుక్కెదురు కావడంతో.. ఎమ్మెల్యేల కోటాలో అయినా.. గుండుగుత్తగా 7 స్థానాలు దక్కించుకుని అంతో ఇంతో గౌరవం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో మంత్రులు తమ తమ పరిధిలోని ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. సమస్యలు చెప్పండి.. మీకేం కావాలో అడగండి.. పార్టీ మాత్రం విజయం దక్కించుకోవాల్సిందే! అని తేల్చి చెబుతున్నారు.
ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరించారు. మార్చి 23వ తేదీన పోలింగ్, అదే రోజు కౌంటింగ్ కూడా జరగనుంది. మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నారా లోకేశ్, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. దీంతో ఆ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
This post was last modified on March 20, 2023 10:40 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…