ప్రత్యేక తెలంగాణా ఉద్యమసారధి ఎవరు ? సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోవటానికి కారణం ఎవరు ? ఈ ప్రశ్నలను ఎవరిని అడిగినా వెంటనే కేసీయార్ అనే సమాధానమిస్తారు. కానీ ఈమధ్యనే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న తోట చంద్రశేఖర్ మాత్రం విచిత్రమైన విషయం చెప్పారు. తోట చెప్పిన తాజా విషయంతో కేసీయార్ గాలి తీసేసినట్లయ్యింది. బీఆర్ఎస్ లోకి కొందరు నేతలు జాయిన్ అయ్యారు.
ఆ సందర్భంగా తోట మాట్లాడుతు రాష్ట్రం విడిపోవటానికి అందరు అనుకునేట్లుగా కేసీయార్ చేసిన ఉద్యమాలు కాదట. కాంగ్రెస్ చేసిన కుట్ర రాజకీయాలకు బీజేపీ సహకరించటం వల్లే సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయిందట. కాంగ్రెస్-బీజేపీ పార్టీలు కలిసే రాష్ట్రాన్ని విడగొట్టాయని తోట స్పష్టంగా ప్రకటించారు. మరింత కాలం చావునోట్లో తలపెట్టి నిరాహారదీక్షలు చేసి ప్రత్యేక తెలంగాణాను సాధించానని కేసీయార్ చేసుకుంటున్నదంతా ఉత్త బిల్డప్పులు మాత్రమే అని తేలిపోయింది.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో కానీ రాష్ట్రం విడిపోవటానికి అందరు అనుకుంటున్న కారణాలు తోటకు మాత్రం భిన్నంగా ఎందుకు కనిపించింది ? రాష్ట్రం విడిపోవటానికి కేసీయార్ కారణం కాదని తోట ఎందుకు చెబుతున్నారు ? నిర్భయంగా తోట ఇంత అబద్ధాలు చెపుబుతున్నారంటేనే విషయం అర్ధమైపోతోంది. కేసీయార్ మీద ఏపీ జనాలు బాగా మండుతున్న విషయం తోటకు అర్ధమయ్యుంటుంది. జనాల్లోని ఆ మంటను తగ్గించటం కోసమే రాష్ట్ర విభజనకు కేసీయార్ కు సంబంధంలేదని, ఆ పాపమంతా కాంగ్రెస్, బీజేపీదే అని తప్పుడు మాటలు చెప్పగలుగుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ ఏదో చేసేస్తుందని కేసీయార్ అనుకుంటున్నట్లున్నారు. కేసీయార్ ఆలోచనలు నిజం కావాలంటే తోటే పూర్తి బాధ్యత తీసుకోవాలి. కానీ తోటకు అంత సీన్ లేదు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యేంతవరకు తోట ఎవరో చాలామందికి తెలీదు. అందుకనే జనాల దృష్టిని ఆకర్షించేందుకు, నలుగురి నోళ్ళల్లో నానేందుకు తోట ఇలాంటి అబద్ధాలను మొదలుపెట్టారు. తాను అబద్ధాలు చెప్పటం ఏమిటో తెలీదుకానీ కేసీయార్ గాలి తీసేస్తున్నట్లు గ్రహించలేకపోయారు.
This post was last modified on March 17, 2023 10:37 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…