ఏపీ పరువు మంటగలిసిపోయింది. దేశంలో ఏ రాష్ట్రానికీ.. పట్టని దుస్థితి పట్టింది. ఏపీకి అప్పులు ఇవ్వొద్దని.. ఇచ్చినా.. ఇవ్వాలని అనుకున్నా..ఒకటికి పది సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్లాలని.. ఆ తర్వాత మీ కొంపలే మునిగిపోయినా.. ఎవరూ కాపాడలేరని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తాజాగా కుండబద్దలు కొట్టింది. 2021 మార్చి నెల చివరి వరకు ఏపీ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించింది.
అంటే, 2019-21 మధ్య రెండేళ్ల నాటి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వు బ్యాంకు కూడా అనేక అంశాలను తప్పుబట్టింది. ఏపీకి అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వివిధ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. రుణాలను భరించే సామర్థ్యం ఏపీకి లేదని.. రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారని కాగ్ ఆక్షేపించింది.
తీసుకున్న రుణాలను ఆస్తుల సృష్టికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలని.. రుణాలపై వడ్డీలు చెల్లించేందుకు, రోజు గడిచేందుకు అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించిం ది. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరికి మొత్తం బకాయిలు జీఎస్డీపీలో 35 శాతానికి మించకూడదని ఎఫ్ఆర్బీఎమ్ చట్టం చెబుతున్నా.. ఏపీ అప్పులు మాత్రం 35.30శాతం ఉన్నాయని తేల్చింది.
బడ్జెట్‌లో చూపించకుండా బయటి నుంచి తీసుకునే రుణాలనూ పరిగణిస్తే ఇది 44.04 శాతం అవుతుందని స్పష్టం చేసింది. 2021 మార్చి 31 నాటికి ఉన్న పరిస్థితుల ప్రకారం రాబోయే ఏడు సంవత్సరాలలో 45.74 శాతం అంటే.. లక్షా 23వేల 640 కోట్ల రూపాయల అప్పులు తీర్చాలని స్పష్టం చేసింది. దీనికి సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తగ్గిపోతాయని రాష్ట్రాన్ని కాగ్ హెచ్చరించింది.
ప్రతి సంవత్సరం రాష్ట్ర అప్పులు పెరుగుతూనే ఉన్నాయని కాగ్ హెచ్చరించింది. రెవెన్యూ వ్యయాన్ని భరించేందుకు రుణాల మొత్తాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని విశ్లేషించింది. తీసుకున్న రుణాల్లో 81శాతం రెవెన్యూ ఖర్చులకే వాడుతోందని, దీంతో ఆదాయం కొరవడుతోందని హెచ్చరించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యవహరించాలని తేల్చి చెప్పింది.
This post was last modified on March 15, 2023 3:12 pm
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…