Political News

ట్రెండింగ్‌లో ‘జస్టిస్‌ ఫర్‌ వైఎస్‌ వివేకా’

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్‌లో “జస్టిస్‌ ఫర్‌ వైఎస్‌ వివేకా” హ్యాష్‌ ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతోంది. ప్ర‌స్తుతం ఇది ట్రెండింగ్‌లో 8వ ప్లేస్‌లో ఉంది. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తవుతుండగా.. ఆయ‌న కుటుంబానికి, ముఖ్యంగా డాక్ట‌ర్ సునీత‌కు న్యాయం చేయాలని నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు. జ‌స్టిస్ ఫర్ వైఎస్‌ వివేకా ట్యాగ్‌తో వేల సంఖ్యలో నెటిజెన్లు సందేశాలను పెడుతున్నారు.

మ‌రోవైపు మరోవైపు టీడీపీ నేతలు కూడా ట్వీట్ల రూపంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే(మాజీ వైసీపీ నాయ‌కుడు) గొట్టిపాటి ర‌వి విభిన్నంగా స్పందించారు. సినిమా రిలీజ్ అవ్వకముందే కథ మొత్తం చెప్పగలిగేవాడు డైరెక్టర్ మాత్రమే కదా అంటూ వివేకా హత్యపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

4 ఏళ్లుగా విచారణ చేస్తున్న సీబీఐ కూడా వివేకా హత్య జరిగిన రోజు జగన్ మోహన్ రెడ్డి చెప్పినంత క్లుప్తంగా చెప్పలేకపోయిందన్నారు. కానీ హత్య జరిగిన నాడే అంత వివరంగా జగన్ ఎలా చెప్పారని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం వీడియోను గొట్టిపాటి రవి తన ట్వీట్కి జత చేశారు.

వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపేసిన హంతకులే నాలుగు సంవత్సరాలుగా నాలుగు కట్టుకథలు వినిపించారని నారా లోకేష్ అన్నారు. బాబాయ్ హత్య కేసులో సీబీఐని బెదిరిస్తూ, దర్యాప్తుకి ఆటంకం కలిగిస్తున్న అసలు నిందితులైన అబ్బాయిలని అరెస్టు చేసి.. వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన పాద‌యాత్ర‌లో డిమాండ్‌ చేశారు.

This post was last modified on March 15, 2023 3:07 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

2 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

3 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

6 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

6 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

7 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

7 hours ago