ఎవరు ఏమంటే అనుకోని.. ఏది ఏమైపోతే.. పోనీ.. అనుకున్నదే సాధించాలని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం జగన్. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్టుగా ఉన్నారు. విశాఖకు తరలిపోయే విషయం.. రాజధానిగా మార్చే విషయం.. ఒకవైపు న్యాయస్థానంలో ఉండగానే ఆయన మాత్రం విశాఖ కు వెళ్లిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకు కేవలం కామెంట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు ముహూర్తం కూడా రెడీ చేసుకున్నారు
తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమాశాల నేపథ్యంలో సీఎం జగన్ విశాఖపై మరో సారి వ్యాఖ్యానించారు. ఈ సారి తేల్చి చెప్పేశారు. మనసులో ఏమీ దాచుకోలేదు. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రులకు చెప్పేశారు. దీంతో.. అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.
విశాఖ పాలనా రాజధాని అని గతంలో ఢిల్లీలోనూ. తర్వాత పెట్టుబడుల సదస్సు సందర్భంగా విశాఖలోనూ సీఎం జగన్ సంచనల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. త్వరలోనే తానూ విశాఖకు షిఫ్ట్ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు కూడా. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే.. మంగళవారం కేబినెట్ భేటీలో సీఎం జగన్.. విశాఖ నుంచి పాలనపై మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
జూలైలో విశాఖకు వెళ్తామని సీఎం జగన్ వాళ్లతో స్పష్టం చేశారు. అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికలపైనా కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో టికెట్ దక్కించుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థలను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. అంతేకాదు.. మంత్రులు సక్రమంగా పని చేయించకపోతే పదవులకు ముప్పు వస్తుందని హెచ్చరించినట్టు సమాచారం.
This post was last modified on March 14, 2023 10:03 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…