ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో వేసిన ఇంప్లిడ్ పిటిషన్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని తెలిపారు. వివేకా హత్యకు ముందు అవినాశ్ ఇంట్లోనే సునీల్‌యాదవ్ ఉన్నాడని పిటిషన్‌లో పేర్కొన్నారు.
2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కావాలనే ఓడించారని, 2019లో వివేకాకు ఎంపీ టికెట్ ఇస్తున్నారనే హత్య చేశారని సునీత సంచలన విషయాలు పేర్కొన్నారు. ఎంపీ టికెట్ కోసం హత్య చేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి చెప్పే ముందే హత్య గురించి అవినాష్‌కు తెలుసని తెలిపారు. హత్య చేశాక అందరినీ కాపాడుకుంటాడని, ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు అవినాశ్ చెప్పాడని సునీతారెడ్డి పేర్కొన్నారు.
“మానాన్న మరణంపై అవినాష్‌కు శివప్రకాశ్‌రెడ్డి సమాచారం ఇచ్చాడు. వివేకా ఇంటికి వచ్చిన శశికళకి గుండెపోటుతో చనిపోయినట్లు అవినాష్ చెప్పాడు. పోలీసులు కూడా వివేకా గుండెపోటుతో పాటు రక్తపు వాంతులతో చనిపోయినట్లు అబద్ధం చెప్పారు. హత్య కాదు.. సాధారణ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వివేకాను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని అవినాష్ చెప్పినట్లు గంగాధర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు” అని సునీత పేర్కొన్నారు.
అంతేకాదు.. విచారణకు సహకరించకుండా కోర్టుల్లో అవినాష్ తప్పుడు కేసులు వేస్తున్నాడన్నారు. “నాపై, నా కుటుంబంపై, దర్యాప్తు అధికారులపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడు. ఏపీ ప్రభుత్వ అధికారులు అవినాశ్‌ను కాపాడాలని చూస్తున్నా రు. సీఐ శంకరయ్య, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, గంగాధర్‌రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయిస్తున్నారు” అని సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
This post was last modified on March 14, 2023 11:05 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…