రాజకీయాల్లో వ్యూహకర్తల కాలం నడుస్తోంది. ఎవరు కాదన్నా.. ఔనన్నా.. ప్రస్తుతం వ్యూహకర్తలే కీలకంగా మారారు. గత 2014 తర్వాత.. రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా.. వ్యూహకర్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకుని మరీ..ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. ఆదిలో వైసీపీ అధినేత జగన్ ప్రశాంత్ కిశోర్ బృందాన్ని తెచ్చుకుని.. 2019 ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకున్నారు. ఇక, జగన్ విషయంలో పీకే వచ్చాక.. పీకేకి ముందు.. అన్నట్టుగా ఆయన గ్రాఫ్ ఉంది.
దీంతో జగన్ ఏకంగా అధికారంలోకి వచ్చారు. జగన్‌ను అధికారంలోకి తెచ్చేందుకు పీకే నానా ప్రయత్నాలు చేశారు. సర్వశక్తులు ఒడ్డారు. పీకేను ఓపెన్‌గానే జగన్ మన వ్యూహకర్త అంటూ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నడూలేనిది టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. వ్యూహకర్తలను నియమించుకునే సంప్రదాయానికి వచ్చారు. ఈ క్రమంలో పీకే టీంలో పనిచేసిన రాబిన్ శర్మను ఆయన తెచ్చుకున్నారు.
పార్టీ అధికారం కోల్పోయి.. ఇప్పటికి నాలుగేళ్లు అవుతోంది. రాబిన్‌శర్మ టీడీపీ వ్యూహకర్తగా వచ్చి కూడా రెండేళ్లు దాటుతోంది. ఈ నాలుగేళ్లలో రాబిన్ శర్మ.. పార్టీని లైన్‌లో పెట్టేందుకు.. ఏమేరకు కష్టపడ్డారు ? అనేది ఇప్పుడు ప్రశ్న. మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అటు బలమైన అధికార పక్షంతో పోటీ పడాల్సిన పరిస్థితి. మరి ఈ క్రమంలో టీడీపీని రాబిన్ శర్మ ఏమేరకు బలోపేతం చేశారనేది ప్రశ్న.
ఎందుకంటే.. ఇప్పటి వరకు ఆయన వ్యూహాలను గమనిస్తే.. పెద్దగా చెప్పుకోదగ్గవి ఏమీ కనిపించడం లేదు. ఉదాహరణకు బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అనే రెండు కాన్సెప్టులు తీసుకువచ్చారు. వాస్తవానికి ఇవి ప్రభుత్వ వ్యతిరేకతపై చేసే ప్రజాపోరాటాల కిందే లెక్క. దీనిలో పార్టీకి ఒరిగేది ప్రత్యేకంగా ఏమీ లేదు. అసలు ఈ రెండు టైటిల్సే ప్రజల్లోకి కాదు.. పార్టీలో దిగువ, మాస్ కార్యకర్తల్లోకే వెళ్లలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సిన కార్యక్రమాల టైటిల్స్ విషయంలోనే ఫెయిట్ అయిన రాబిన్ శర్మ ఇక పార్టీని ఎలా అధికారంలోకి తెస్తాడన్నది పార్టీ వర్గాలకే అంతు పట్టడం లేదు.
ఇక కమ్యూనిస్టులు సైతం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే.. టీడీపీ గ్రాఫ్ పెరిగేలా వ్యక్తిగత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారా? అంటే లేనేలేదు. పైగా.. పార్టీలో ఇప్పటికీ అసంతృప్తి అలానే ఉంది. అంతేకాదు.. వైసీపీ వ్యూహాలకు పదునైన వ్యూహాలు వేసేలా.. పార్టీని సమర్థవంతంగా నడిపించేలా రాబిన్ శర్మ చేసిన ప్రయోగాలు.. ప్రయత్నాలు కూడా కనిపించడం లేదు. మరి దీనిని బట్టి రాబిన్ శర్మతో టీడీపీకి ప్లస్ కన్నా.. మైనస్సే ఎక్కువగా ఉందని… చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిస్థితి అంచనా వేసుకుని ముందుకు వెళ్లకపోతే డేంజరే అన్న చర్చలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
This post was last modified on March 13, 2023 12:28 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…