Political News

కాపు నేత‌లు పెద్ద‌న్న‌లు కావాలి: ప‌వ‌న్ పిలుపు

ఏపీ అధికార పార్టీ వైసీపీపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌న ద‌గ్గ‌ర వెయ్యి కోట్లు లేవ‌ని..పార్టీని ఏక‌బిగిన న‌డ‌ప‌లేన‌ని వ్యాఖ్యానించారు. నేత‌ల‌ను కూడా కొనుగోలు చేసే శ‌క్తి త‌న‌కు లేద‌న్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వ‌రుస‌గా రెండో రోజు జ‌రిగిన కాపు సంక్షేమ సేన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనన్నారు. వాస్తవిక ధోరణి ఎలా ఉందో దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తాన‌ని చెప్పారు.

జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించబోమ‌ని చెప్పారు. ఇతర పార్టీల అజెండా కోసం మేం పనిచేసేది లేదని మ‌రోసారిప‌వ‌న్ తేల్చి చెప్పారు. “రూ.వెయ్యి కోట్లతో రాజకీయాలు చేయలేం, పార్టీ నడపలేం. భావనాబలం ఉంటేనే పార్టీని నడపగలం. పార్టీని ఇంకా ప్రతికూల పవనాల మధ్యే నడుపుతున్నా. కాపులంతా నాకు ఓటేస్తే గాజువాక, భీమవరంలో గెలిచేవాడిని” అని అన్నారు.

అనేక అవ‌మానాలు ప‌డ్డా!
రాజ‌కీయాల్లోకి రాక‌ముందు.. తాను అంద‌రితోనూ శ‌భాష్ అనిపించుకున్నాన‌ని .. కానీ, రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ప‌దేళ్లుగా అనేక మాటలు పడ్డాన‌ని ప‌వ‌న్ చెప్పారు. గత ప్రభుత్వంలో రిజర్వేషన్‌ గురించి మాట్లాడినవారు ఇప్పుడెందుకు మాట్లాడరని ప‌రోక్షంగా ముద్ర‌గ‌డ ప‌ద్మనాభాన్ని నిల‌దీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడారా? అని ప్ర‌శ్నించారు. కాపుల వైపు నిలబడబోమని చెప్పినా ఓటేసి గెలిపించారంటూ.. గ‌తంలో జ‌గ‌న్ జ‌గ్గంపేట‌లో చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న చూపించారు.

ఈ ఎన్నిక‌లు కీల‌కం..
2024 ఎన్నికలు చాలా కీలకం. సంఖ్యాబలాన్ని అనుసరించి మన సత్తా చాటుకోవాలని పవ‌న్ పిలుపునిచ్చారు. రాజకీయ సాధికారిత కావాలంటే కాపులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ” 2008-09లో జరిగిన ఘటనలు నాలో పంతం పెంచాయి. ఉపాధి, ఉద్యోగాలు కావాలని అడిగే స్థితిలోనే ఇంకా ఉన్నాం. పెద్ద కులాలతో గొడవలు వద్దు.. అన్ని కులాలను సమానంగా చూడాలి. కాపులు కూడా కట్టుబాటు తీసుకోవాలి” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

This post was last modified on March 12, 2023 10:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

14 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago