గత కొన్ని నెలలుగా.. తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు కూడా వస్తున్నా యి. కీలకమైన దళితబంధు పథకాన్ని వారు దారిమళ్లిస్తున్నారని.. ఈ పథకంలో లబ్ది పొందాలంటే.. చేతులు తడపక తప్పనిపరిస్థితి వస్తోందని.. ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై ఇటీవల కాలంలో అనేక మీడియా సంస్థలు వార్తలు రాస్తూనే ఉన్నాయి.
కొందరు అధికారులతో కుమ్మక్కయితే.. మరికొందరు ఎమ్మెల్యేలు..నేరుగానే ఈ పథకంలో నిధులు బొక్కు తున్నారని కూడా ఆరోపణలు వినిపించాయి. మరోసారి అధికారంలోకి తెచ్చిపెట్టే కీలకమైన పథకంగా భావిస్తున్న దళితబంధు ఆరోపణలను ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. అయితే.. ఏయే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే వివరాలు సీఎం కేసీఆర్‌కు చేరిపోయాయి. దీంతో ఆయన నేరుగానే వారిని హెచ్చరించారు.
దళితబంధు అమలు తీరుపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. దళితబంధు కోసం కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్న వైనాన్ని ఆయన కళ్లకు కట్టారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలో కొందరు డబ్బులు వసూలు చేశారని.. ఆ వివరాలు.. అన్నీ తన దగ్గర ఉన్నాయని కేసీఆర్ కుండబద్దలు కొట్టడంతో ఎమ్మెల్యేలు గుడ్లు తేలేశారు. అయితే.. ఈ సమయంలో కేసీఆర్ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు కానీ, వార్నింగ్ అయితే ఇచ్చారు.
మళ్లీ ఇలాంటి నొక్కుళ్లు రిపీట్ అయితే..ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించారు. “దళిత బంధు.. మనల్ని కాపాడే పథకం. ఏమనుకుంటున్నరు? ” అని ఎమ్మెల్యేలను సీఎం నిగ్గదీసినట్టు సమాచారం. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ దారి మార్చుకుంటారో లేదో చూడాలి. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో అత్యంత రహస్యంగా చేసిన ఈ హెచ్చరికలు తాజాగా లీక్ అయ్యాయి.
This post was last modified on March 12, 2023 7:16 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…