తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. రోజుకు సగటున సుమారు 13 కిలోమీటర్లు నడుస్తున్న లోకేశ్ 39 రోజుల్లో 500 కిలోమీటర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అన్నమయ్య జిల్లా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జిల్లాలో టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా లోకేశ్ తన యాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఒక కీలక హామీ ఇస్తున్నారు.
100 కిలోమీటర్లు:
2022 డిసెంబర్ నెల 27వ తేదీ కుప్పంలో మొదలైన పాదయాత్ర 8వ రోజు న 100 కిలోమీటర్ల మైలు రాయి దాటినప్పుడు గత ఫిబ్రవరి 3వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
200 కిలోమీటర్లు:
అలాగే యాత్ర 16వ రోజున 200 కిలోమీటర్లు చేరినప్పుడు గంగాధర నెల్లూరు వద్ద డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఫిబ్రవరి 11వ తేదీన హామీ ఇచ్చారు.
300 కిలోమీటర్లు:
తరువాత ఫిబ్రవరి 21వ తేదీన 23 వ రోజున యాత్ర 300 కిలోమీటర్లు దాటినప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద 13 గ్రామాల దాహార్తి తీర్చే నీటి పధకాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.
400 కిలోమీటర్లు:
మార్చి 1వ తేదీన 32వ రోజున యాత్ర 400 కిలోమీటర్లు చేరింది. అప్పటికి యాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో సాగుతోంది. దీంతో చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్ర పురం వద్ద ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
500 కిలోమీటర్లు:
ఇక గురువారం యాత్ర 39వ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం సీటీఎం వద్ద 500 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఆ సందర్బంగా లోకేశ్ సీటీఎం వద్ద టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి వంద కిలోమీటర్లు పూర్తి అయిన చోట ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరించి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు అమలు చేస్తామనే హామీలను ఇస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్న లోకేష్ ప్రతి వంద కిలోమీటర్ల యాత్ర పూర్తి అయిన సందర్బంగా స్థానికులకు ప్రత్యేక హామీలు ఇస్తూ గుర్తుగా శిలా ఫలకం ఏర్పాటు చేసే ఆనవాయితీ ని కొనసాగిస్తున్నారు.
This post was last modified on March 10, 2023 11:09 am
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…