Political News

చేసిన మంచి పనులే చిరస్థాయిగా….

పార్టీలు వస్తాయి..పోతాయి…సీఎంలు వస్తారు..పోతారు.. చాలా మంది కాలగర్భంలో కలిసిపోతారు. కొందరు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతారు. మన తన అన్న భేదం లేకుండా సహాయం చేసే వారే ఎక్కువ కాలం ప్రజల నోళ్లలో నలుగుతారు… అలాంటి వారిలో చంద్రబాబు ఒకరిని ఇటీవల జరిగిన ఘటన నిరూపిస్తోంది..

పీలేరు నియోజకవర్గం చింతలవారిపల్లి మాజీ సర్పంచ్ అశోక్ ఒకప్పుడు వైసీపీకి కొమ్ముకాశారు. టీడీపీని అనరాని మాటలు అన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు తెస్తూ ప్రమాదానికి గురయ్యారు. దానితో రెండు నెలల పాటు మంచానికే పరిమితమయ్యారు. అశోక్ ను, ఆయన కుటుంబాన్ని వైసీపీ అసలు పట్టించుకోలేదు. కన్నెత్తి కూడా అటు వైపు చూడలేదు. దానితో అశోక్ కుటుంబ‌స‌భ్యులు టీడీపీ ప్రధాన కార్యదర్శి న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని సహాయం కోరారు. ఆయ‌న‌ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి సిఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 30 లక్షలు సహాయం ఇప్పించారు. వైద్యంతో అశోక్ ప్రాణాలు నిలిచాయి.

కులం, మతం, ప్రాంతం, పార్టీ భేషజాలు పోకుండా చంద్రబాబు ప్రభుత్వం సాయం చేసింది. ఆ సంగతి చాలా మంది మరిచిపోయినా.. అశోక్ కుటుంబం మాత్రం చంద్రబాబు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంది. పీలేరు నియోజకవర్గంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తూ చింతపర్తి విడిది కేంద్రంలో ఉన్న‌ నారా లోకేష్‌ని అశోక్ కుటుంబ సభ్యులు క‌లిసి చంద్ర‌బాబుకి, తెలుగుదేశం పార్టీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. కన్నీటి పర్యంతమయ్యారు. అంత సాయం చేసినప్పటికీ కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం ఎక్కడా తన గొప్పదనాన్ని చెప్పుకోలేదు.

This post was last modified on March 8, 2023 4:10 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago