టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ పాదయాత్రకు టీడీపీ నేతల నుంచి మంచి స్పందన వస్తోంది. యువ నాయకులు అందరూ నారా లోకేష్‌తో కలిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన యువ నాయకుడు, టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ కూడా నారా లోకేష్‌తో పాదాలు కలిపారు.
గత జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుం ది. అయితే.. నెల రోజులు దాటిపోయినప్పటికీ.. ఇతర జిల్లాలకు చెందిన యువ నాయకులు పెద్దగా కని పించలేదు. తమ తమ జిల్లాల్లో ఈ యాత్ర జరిగినప్పుడు.. మద్దతు ఇవ్వాలని భావించినట్టు ఆయా నేతలు ప్రకటించారు. దీంతో యాత్ర జరుగుతున్న జిల్లాల నుంచి మాత్రమే నాయకులు వచ్చారు.
కానీ, తాజాగా వంగవీటి రాధా పీలేరుకు చేరుకుని.. నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం తోపాటు.. ఆయనతో కలిసి అడుగులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. 36 రోజులుగా సాగుతున్న యాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు నారా లోకేష్‌ను కలిసి.. సమస్యలు చెప్పుకొంటున్నారు.
This post was last modified on March 7, 2023 2:39 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…