ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రతిరోజూ ఎలక్షనే అన్నట్లుగా ఆ మూడ్ క్రియేట్ అయిపోయింది. రాష్ట్ర స్థాయి నుంచి ఎటు చూసినా ఓట్ల లెక్కలు, సీట్ల లెక్కలే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఎలక్షన్ ఫీవర్ ఈ రేంజ్‌లో ఉన్న సమయంలో కొన్ని సర్వేలూ అంచనాలు వెలువరిస్తున్నాయి. ఈ సర్వేలు టీడీపీకి అనుకూలత చూపిస్తున్నా ఆ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని మాత్రం చెప్పడం లేదు. దీంతో వచ్చే ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్న చంద్రబాబు, లోకేశ్‌లలో కంగారు కనిపిస్తోంది.
నిజానికి ఉవ్వెత్తున లేచిన కెరటంలా 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడేళ్లు తిరిగే సరికి ప్రభుత్వ వ్యతిరేకతను చవిచూసింది. ఆ స్థాయిలో మెజారిటీతో అధికారం అందుకున్న పార్టీలు సాధారణంగా కళ్లు మూసుకుని పదేళ్ల పాటు పాలన సాగించగలుగుతాయి. కేంద్రంలో బీజేపీ చేస్తున్నది అదే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను 2014లో చితక్కొట్టేసిన తరువాత అడ్డనేదే లేకుండా రెండు టర్ములుగా దూసుకుపోతోంది. కానీ,…. ఏపీలో వైసీపీ మాత్రం స్వయంకృతాపరాధాలతో దెబ్బతిని వచ్చే ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లను కోల్పోవడానికి సిద్ధమైపోయింది. కానీ.. వైసీపీ వైఫల్యాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో టీడీపీ ఇంకా వెనుకబడే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తాజాగా ఆత్మ సాక్షి సర్వే ఆధారంగా లెక్కలు వేస్తున్నప్పటికీ ఎన్నికల నాటికి పరిస్తితులు ఎలా మారుతాయన్నది చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో గత రెండు ఎన్నికలలో టీడీపీ మెరుగుపడని నియోజకవర్గాలపై దృష్టిపెట్టడమనేది తక్షణావసరంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఏపీలో ఎస్టీ రిజర్వ్ స్థానాలు 7 ఉన్నాయి. అందులో టీడీపీ 2014లో ఒకటి.. 2009లో ఒకటి మాత్రమే గెలిచింది. 2019లో ఒక్క ఎస్టీ స్థానం కూడా టీడీపీ గెలవలేకపోయింది.
ఇక ఎస్సీ రిజర్వ్ స్థానాలు 29 ఉన్నాయి. వీటిలో 11 సీట్లలో గత మూడు ఎన్నికలలోనూ వరుసగా ఓడిపోతూ వస్తోంది టీడీపీ. మొత్తంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 50 చోట్ల వరుసగా మూడు ఎన్నికల్లోనూ ఓడిపోయింది టీడీపీ. ఇక 2019 ఎన్నికల్లో ఆ పార్టీ సాధించింది 23 సీట్లే. 2019లో రాయలసీమలోని 52 స్థానాలలో 3 మాత్రమే గెలిచింది.
అయితే… ఇప్పుడిప్పుడే వేగం పెంచుతున్న టీడీపీ ఎన్నికల నాటికి కనుక పుంజుకొంటే వైసీపీకి ఓటమి తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకుగాను ఆ పార్టీ కంచుకోటలపైనే కాకుండా తమకు కొన్నాళ్లుగా అవకాశమివ్వని నియోజకవర్గాలపైనా దృష్టి పెడితే ఫలితం ఉండొచ్చు.
This post was last modified on March 7, 2023 10:23 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…