Political News

రెబ‌ల్ ఎంపీ గ్రాఫ్ పెరిగిందా?  త‌రిగిందా?

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు గ్రాఫ్ పెరిగిందా?  త‌రిగిందా? ఏం జ‌రుగుతోంది? ఇదీ.. ఇప్పుడు ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న కీల‌క‌ చ‌ర్చ‌. దీనికి కార‌ణం .. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. న‌ర‌సాపురం టికెట్‌ను మాత్రం టీడీపీకే కేటాయిస్తార‌ని స‌మాచారం.

టీడీపీ త‌ర‌ఫున తాను పోటీచేయ‌నున్న‌ట్టు చూచాయ‌గా స‌ద‌రు ఎంపీ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఇప్పుడు ఎంపీ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న పోటీకి దిగితే నిలిచి గెలిచే ప‌రిస్థితి ఉందా? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఎంపీని అస‌లు రాష్ట్రంలోకే అడుగు పెట్ట‌కుండా.. వైసీపీ అధినాయ‌క‌త్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని.. స‌ద‌రు ఎంపీనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

త‌నను హైద‌రాబాద్ వ‌స్తేనే వెంటాడుతున్నార‌ని ర‌ఘురామ చెబుతున్నారు. స‌రే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసినా ప్రచారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై నే అనేక సందేహాలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో ర‌ఘురామ‌పై సానుభూతి ఉంది. ఆయ‌న ప‌ట్ల వారు సానుకూలంగానే ఉన్నారు.

అయితే, ఎన్నిక‌ల నాటికి క్ష‌త్రియుల‌ను కూడా ఓటు బ్యాంకు రూపంలో చీల్చే ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతుండ‌డం.. ఇక్క‌డ వైసీపీకి అనుకూలంగా పావులు క‌దుపుతుండ‌డం ఎంపీ విష‌యంపై చ‌ర్చ‌కు దారితీస్తోంది. పైగా.. గ‌తంలో టీడీపీ ఇక్క‌డ గెలిచిన ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ర‌ఘురామ టీడీపీ త‌ర‌ఫున పోటీకి దిగితే.. సానుకూల ప‌వ‌నాలు ఏమేర‌కు ఉంటాయ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ త‌ర‌ఫున  కాకుండా.. ఆయ‌న ఒంట‌రిగానే బ‌రిలోకి దిగితే.. సానుభూతి వ‌స్తుందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

3 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

4 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

4 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

5 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

6 hours ago