సీబీఐ వదల బొమ్మాళి అంటోంది. వైఎస్ వివేనానంద రెడ్డి హత్య కేసులో విచారణకు రాకుండా జాప్యం చేసే వారిని వెంటబడి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఎంతటివారైనా సరే సీబీఐ అధికారులు వెళ్లి నోటీసులు ఇచ్చి వస్తున్నారు. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది….
సోమవారం హాజరు కావాలని అవినాష్ కు ఇటీవల సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. పులివెందుల వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. తేదీ మార్చడం కుదరదని చెప్పేశారు. అయితే ముందుగా నిర్ణయించిన సమావేశాలు ఉన్నందున సోమావరం రాలేనని అవినాష్ లేఖ పంపారు. పులివెందుల, వేంపల్లెలో కార్యకర్తల సమావేశాలున్నాయని అవినాష్ చెఫ్పుకొచ్చారు. మరో రోజున వస్తానని హామీ ఇచ్చారు.
ఆదివారం అవినాష్ లేఖ అందిన వెంటనే సీబీఐ అధికారులు వేగంగా స్పందించారు. మరో నోటీసు తీసుకెళ్లి పులివెందులలో ఆయన ఇంటిలో అందజేశారు. పదవ తేదీన హాజరు కావాలని అందులో ప్రస్తావించారు. ఆదివారం రాత్రి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు, పదో తేదీన హైదరాబాద్ లో హాజరు కావాల్సి ఉంటుందని అవినాష్ కు తెలిపారు. అంటే అవినాష్ సీబీఐ ముందు మూడో సారి హాజరవుతున్నారన్నమాట. అవినాష్ ను మాత్రమే లోపలికి అనుమతిస్తున్న సీబీఐ అధికారులు… ఆయన లాయర్లను కూడా బయటనే ఉంచుతున్నారు.
అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న కడపలో తమ ముందు హాజరు కావాలని ఆదేశించారుు. ఈ నోటీసులు రెండుమూడు రోజుల క్రితమే భాస్కర్ రెడ్డికి అందినట్లు సమాచారం. వివేకా కేసులో కీలకాంశాలను బేరీజు వేసుకునేందుకు భాస్కర్ రెడ్డిని ప్రశ్నించడం అనివార్యమవుతుందని సీబీఐ అంటోంది.
This post was last modified on March 6, 2023 12:21 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…