వినటానికి విచిత్రంగా ఉన్నా ఇందులో పేద్ద లాజిక్ ఉంది. తెలంగాణా సాధన కోసమే కేసీయార్ ఏర్పాటుచేసిన తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని తాజా పరిణామాల్లో జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. అయితే కేసీయార్ చేసిన పనిపై రాష్ట్రంలోని జనాలతో పాటు ప్రతిపక్షాల్లో వ్యతిరేకత కనబడుతోంది. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ తెలంగాణాను గాలికొదిలేశారనే గోల పెరిగిపోతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే ఎవరో పావులు కదుపుతున్నట్లు అనుమానంగా ఉంది.
ఇంతకీ పావులు ఎలా కదుపుతున్నారంటే టీఆర్ఎస్ పేరుతో కొత్తగా రాజకీయపార్టీ పెట్టేట్లుగా. టీఆర్ఎస్ అంటే మూడు పేర్లు వినబడుతున్నాయి. అవేమిటంటే తెలంగాణా రాజ్యసమితి, తెలంగాణా రైతుసమితి, తెలంగాణా రక్షణసమితి అని ప్రచారం జరుగుతోంది. పై మూడు పేర్లతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పై పేర్లతో ఎవరు దరఖాస్తులు చేసుకున్నారనే విషయం మాత్రం గోప్యంగానే ఉంది.
ఒకపుడు టీఆర్ఎస్ లో బాగా యాక్టివ్ గా ఉండి ఇపుడు అంటీ ముట్టనట్లున్నవారు, పార్టీలో నుండి బయటకు వచ్చేసిన నేతలే ఎవరో పై మూడుపేర్లతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నేతలున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఏదేమైనా పై మూడు పేర్లలో దేన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆమోదించినా బీఆర్ఎస్ కు చికాకులు ఎదురయ్యే అవకాశముంది. ఇప్పటివరకు పార్టీ గుర్తు కారును పోలిన ఇతర గుర్తులతోనే సమస్య ఎదురవుతోంది. అలాంటిది ఇపుడు పార్టీ పేరుతో చికాకులు కూడా ఎదుర్కోక తప్పేట్లులేదు. నిజానికి పార్టీపేరు టీఆర్ఎస్ అని పాపులైనట్లుగా బీఆర్ఎస్ అని ఇంకా పాపులర్ కాలేదనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే ఊహించని రీతిలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ అనే పేరు బ్యాలెట్ లో కనబడితే జనాల్లో కన్ఫ్యూజన్ తప్పేట్లులేదు. దాంతో బీఆర్ఎస్ కు అదనపు నష్టం తప్పదనే అనిపిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on March 5, 2023 4:02 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…