Political News

ప్రతిష్ట పెరుగుతుందనుకుంటే పరువు పోతోందే..

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన దగ్గర్నుంచి పారిశ్రామిక విధానం విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న పరిశ్రమలను బెదరగొట్టి తరలిపోయేలా చేయడం.. చెప్పుకోదగ్గ కొత్త పరిశ్రమలు ఏవీ తీసుకురాకపోవడం పట్ల ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని సింపుల్‌గా వైసీపీ నేతలు ఈ విషయంలో దాటవేయడానికి కూడా వీల్లేకపోతోంది. కళ్ల ముందు ఏం జరుగుతోందో జనాలకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో నెగెటివిటీ తగ్గించేందుకు ఈ మధ్య ప్రయత్నాలు మొదలయ్యాయి. గత ఏడాది దావోస్ సమ్మిట్‌కు వెళ్లినపుడు జగన్ అండ్ కో కామెడీ అవ్వడం తప్ప పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఈసారి ఆ సమ్మిట్‌కు అసలు ప్రభుత్వం తరఫున ప్రతినిధులే వెళ్లలేదు. ఇదేంటని అడిగితే.. పారిశ్రామిక వేత్తలనే ఇక్కడికి రప్పిస్తాం అన్నారు.

ఈ క్రమంలోనే విశాఖలో గ్లోబల్ సమ్మిట్ అంటూ కొన్ని రోజుల నుంచి హడావుడి నడుస్తోంది.
తీరా వైజాగ్ గ్లోబల్ సమ్మిట్‌‌కు సమయం రానే వచ్చింది. మామూలుగా ఇలాంటి సమ్మిట్‌లు పూర్తయ్యాక అందులో జరిగిన ఒప్పందాలు.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలు ప్రకటిస్తారు. కానీ సమ్మిట్ ఆరంభ సమయంలోనే సీఎం జగన్ ఘనంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటన చేసేశారు. ఇది అందరికీ విస్మయం కలిగించింది. మధ్యాహ్నానికల్లా పెట్టుబడుల వెల్లువ అంటూ మీడియాకు వివరాలు కూడా వెల్లడించేశారు. ఆ వివరాలు చూశాక సోషల్ మీడియా జనాలు రంగంలోకి దిగిపోయి జగన్ ప్రకటనల డొల్లతనం అంతా బయటపెట్టేశారు.

కనీసం వంద కోట్ల క్యాపిటల్ కూడా లేని సాయి అండ్ ఎలక్ట్రికల్స్ అనే సంస్థ 8 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడం.. దశాబ్దాల వ్యవధిలో 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 20 వేల ఉద్యోగులను మాత్రమే కలిగి ఉన్న ఎన్టీపీసీ.. ఏపీలో 2.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు, 77 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొనడం.. ఇలాంటి వివరాలన్నీ బయటికి తీసి జగన్ సర్కారును ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.

పెట్టుబడుల గురించి కొంచెం ఎక్కువ చూపించుకోవచ్చు కానీ.. మరీ ఇలా నమ్మశక్యం కాని నంబర్లతో గారడీ చేయడం వల్ల జగన్ సర్కారుకు చెడ్డ పేరు రావడం తప్ప ఒరిగే ప్రయోజనం శూన్యం. ఓవైపు ఈ నంబర్ల వ్యవహారం కాస్తా కామెడీ అయిపోతే.. మరోవైపు ఈ సమ్మిట్లో డెలిగేట్స్‌కు ఇచ్చే కిట్ల దోపిడీ జరగడం.. భోజనాల దగ్గర నానా రభస జరగడం.. ప్రతినిధుల కోసం కేటాయించిన సీట్లలో ఐప్యాక్ బ్యాచ్‌ లాగా భావిస్తున్న వ్యక్తులు కూర్చుని హంగామా చేయడం.. లాంటి వ్యవహారాలతో జగన్ ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోతోంది.

This post was last modified on March 4, 2023 2:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

జ‌గ‌న్ స‌భ్య‌త్వం ర‌ద్దు.. స్పీక‌ర్ ఏంచేయాలంటే?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న పార్టీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న మ‌రో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ స‌మావేశాల‌కు…

30 mins ago

నయనతార బయోపిక్కులో ఏముంది

రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…

44 mins ago

గ‌ద్ద‌ర్ కుటుంబానికి గౌర‌వం.. వెన్నెల‌కు కీల‌క ప‌ద‌వి

ప్ర‌జాయుద్ధ నౌక‌.. ప్ర‌ముఖ గాయ‌కుడు గ‌ద్ద‌ర్ కుటుంబానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఎన‌లేని గౌర‌వం ఇచ్చింది. గ‌ద్ద‌ర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెల‌ను…

2 hours ago

త‌మ‌న్ చేతిలో ఎన్ని సినిమాలు బాబోయ్

ద‌క్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అంటే త‌మ‌న్ పేరు త‌ట్ట‌క‌పోవ‌చ్చు కానీ.. త‌న చేతిలో ఉన్న‌ప్రాజెక్టుల లిస్టు చూస్తే…

2 hours ago

సీఐడీ చేతికి పోసాని కేసు

వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…

2 hours ago