విశాఖ వేదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం చెప్తోంది. అంబానీ, జీఎంఆర్, జిందాల్ వంటి దేశ పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరై జగన్ పరువు నిలబెట్టారు. అయితే… అదేసమయంలో ఇతర చిన్నాచితకా ఇన్వెస్టర్లుగా హాజరైనవారిలో అత్యధికులు ఐప్యాక్ ప్రతినిధులేనన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఐప్యాక్‌లో పనిచేసేవారిలో చాలామంది ఎంబీఏలు చేసినవారు, సాఫ్ట్‌వేర్ కోర్సులు చేసినవారు ఉండడం… ఉత్తరాదికి చెందినవారు ఉండడంతో వారంతా ఇన్వెస్టర్లలా, ఔత్సాహికుల్లా ఈ సదస్సుకు వచ్చారని విపక్షాలు అంటున్నాయి.
సాధారణ ప్రజలు, మీడియా వారిని చూసి ఇన్వెస్టర్లు అనుకుని మోసపోతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో వైసీపీ కార్యక్రమాలు, ఐప్యాక్ ఆఫీసులలో కనిపించిన కొందరు ఫొటోలు… ఇప్పుడు ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పాల్గొన్నవారి ఫొటోలతో పోల్చి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
రష్యాలో పుతిన్ కూడా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కొందరు వ్యక్తులు, సొంత పార్టీకి చెందినవారు ఆయాపాత్రలలో కనిపిస్తుంటారని.. ఏ వర్గానికి చెందిన కార్యక్రమంలో పాల్గొంటే ఆ వర్గానికి చెందినవారిలా నటిస్తూ పుతిన్‌తో ఆయన సొంత మనుషులే భేటీ అవుతుంటారని అంతర్జాతీయంగా ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఏపీలో జగన్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణే వస్తోంది. వైసీపీ రాజకీయ అవసరాలు, ఎన్నికల కోసం పనిచేసే ఐప్యాక్ ప్రతినిదులే ఈ ఇన్వెస్టర్ల సదస్సులోనూ కనిపించారని చెప్తున్నారు.
దేశమంతటికీ తెలిసిన కొందరు పారిశ్రామిక ప్రముఖులు తప్ప మిగతావారిలో అత్యధికులు ఐప్యాక్ ప్రతినిధులు.. దేశవిదేశాల్లో ఉన్న వైసీపీ సానుభూతిపరులేనని… వారు చేసుకున్న ఒప్పందాలన్నీ హంబక్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
This post was last modified on March 4, 2023 1:55 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…