ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య మంత్రి జగన్ ఈ సదస్సును ప్రారంభించారు. ఇక, ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి కూడా ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చారు. అయితే.. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావించినప్పటికీ.. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా సమ్మిట్ కు వచ్చిన వారికి ఇచ్చేందుకు కిట్‌లు ఇచ్చారు. అయితే.. వీటిని సరైన విధానంలో పంపిణీ చేయకపోవడంతో తోపులాటలు చోటు చేసుకున్నాయి.
అదేసమయంలో సమ్మిట్ సక్సెస్ కోసం.. తోచిన వారికి.. అడిగిన వారికి కూడా పాస్‌లు ఇష్యూ చేశారు. దీంతో అసలు పెట్టుబడులు పెట్టేవారి కంటే.. చూసేందుకు వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. పైగా ఉచిత రిజిస్ట్రేషన్ అనగానే . తండోపతండాలుగా వచ్చేశారు. దీంతో అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులను గుర్తించడంలో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. ఇక, భోజనాల సమయానికి మరింత గందరగోళం ఏర్పడింది. కోట్ల రూపాయలు(సుమారు 15 కోట్లు) ఖర్చు చేసిన ఈ సదస్సుకు.. పెట్టుబడులు ఎన్ని వస్తాయో తెలియదు. కానీ, వివాదాలు మాత్రం వచ్చాయి.
పెట్టుబడుల సమ్మిట్‌లో కిట్‌లు, భోజనాల కోసం కుమ్ములాట జరిగింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. నిజానికి గతంలోనూ చంద్రబాబు హయాంలో విశాఖలోనే పెట్టుబడుల సదస్సు పెట్టారు. కానీ, భోజనాల కోసం తోపులాటలు చోటు చేసుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం తీవ్ర వివాదంగా మారింది. ఎప్పుడైనా ఇన్వస్టర్స్ సమ్మిట్ పెట్టేటప్పుడు ఎవరు ఇన్వస్టర్లు, ఎవరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేదానిపై అధికారులకు క్లారిటీగా ఉండాలి.
అయితే తాజా సమ్మిట్‌పై నీలిమేఘాలు కమ్ముకోవడంతో సదస్సును విజయవంతం చేసుకునేందుకు.. జనసంఖ్య భారీగా కనిపించాలని ప్రభుత్వం ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించింది. దీంతో భారీ సంఖ్యలో వచ్చేశారు. పలితంగా కిట్లు చాలలేదు. దీనికి తోడు భోజన ఏర్పాట్లలోనూ వీఐపీలు, వీవీఐపీల గ్యాలరీల్లోనూ సాధారణ వ్యక్తులు దూసుకువచ్చారు. దీంతో సమ్మిట్ తొలిరోజే వివాదాలకు.. విమర్శలకు.. ప్రతినిధుల అవమానాలకు.. అసహనాలకు వేదిక అయిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 3, 2023 10:04 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…