విశాఖ పెట్టుబడుల సదస్సుకు రంగం సిద్ధమైంది. మార్చి 3,4 తేదీల్లో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రిలయన్, అంబానీ సంస్థల ప్రతినిధులుతో పాటు అమెరికా, ఐరోపా, ఆసియాలోని బడా కంపెనీల ప్రతినిధులను కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అందులో ఎక్కువ మంది వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. విశాఖను రాజధానిగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నామనుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కూడా ప్రచారం కోసం పెట్టుబడుల సదస్సును వాడుకుంటోంది.
రంగుల మయం
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అన్ని చోట్ల వైసీపీ రంగులు కనిపించాలని అనధికార ఆదేశాలు అందాయి. దానితో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చివరకు ప్రైవేటు భవనాలకు కూడా పార్టీ రంగులు వేసేశారు. కొన్ని సందర్భాల్లో అటువంటి ప్రయత్నాలు వివాదాస్పదమయ్యాయి.
పెట్టుబడుల సదస్సు జరుగుతున్న వేళ ఇప్పుడు విశాఖలో ఈ రంగుల పిచ్చి మరింత ముదిరి..నగరం అంతా ఇవే రంగులు దర్శనం ఇస్తున్నాయి. సదస్సుకు హాజరు కావడానికి ప్రతినిధులు ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత ప్రయాణించే మార్గాలు, బసచేసే హోటళ్లు, సందర్శించే ప్రాంతాలతోపాటు వాటి పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.దీని కోసం రూ. 125 కోట్లు కేటాయించారు. ఆ వంకతోనే అధికార వైసీపీ మెప్పుకోసం జీవీఎంసీ అధికారులు ఏకంగా విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల ఫ్రేమ్‌లను కూడా నీలం , తెలుపు రంగులతో నింపేశారు. వాటితో పాటు డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్డు పక్క గోడలకు పార్టీ రంగులు వేయడానికే సుమారు రూ.20 కోట్లను వెచ్చిస్తున్నట్టు అధికారులే చెబుతున్నారు.
అసలు రూల్స్ ఏమిటో ?
సాధారణంగా జాతీయ రహదారుల సంస్థ, రోడ్లు, భవనాల శాఖ మార్గదర్శకాల ప్రకారం రోడ్డుపై పసుపు, నలుపు రంగులను మాత్రమే వేయాలి. దీనివల్ల రాత్రివేళ వాహనదారులకు రోడ్డు మార్జిన్‌పై నిర్దిష్టమైన అంచనా ఉంటుంది. అయితే 3, 4 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సుతో పాటు నెలాఖరుకు నిర్వహించే జీ-20 సదస్సు కోసం నగరమంతా రంగులమయం చేస్తున్నారు.
జాతీయ రహదారితోపాటు నగరంలోని అంతర్గత రోడ్ల డివైడర్లు, సెంటర్ మీడియన్లకు వైసీపీ రంగులు వేయిస్తున్నారు.ఆఖరికి బీచ్‌రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా ఉన్న పోలీస్ అవుట్ పోస్టుకు ఏకంగా నీలం, తెలుపురంగు వేసేశారు. బస్ స్టాప్ కు కూడా వైసిపి కలర్స్ వేయడంపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రంగుల విషయంలో కోర్టులు మొట్టికాయలు వేసినా అధికార పార్టీ తీరు మారలేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి..
This post was last modified on %s = human-readable time difference 10:18 pm
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వచ్చిన తొలినాళ్లలో చేయాలనుకున్న పనులను కొంత లేటుగా ప్రారంభించేవారు.…
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈమధ్య మరింత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’లో నటిస్తున్నాడు.…
ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు…
కొత్త ఆర్థిక, వినియోగ నియమాలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ),…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఎన్వీఎస్ ఎస్…