ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందనే సర్వేలు వస్తున్నాయి. ముఖ్యంగా షార్ప్ షూటర్‌గా పేరున్న కీలక నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గత ఎన్నికలలో ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. జగన్ తొలి కేబినెట్‌లోనే బాలినేని మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇక, రెండోసారి ఛాన్స్ దక్కక పోయే సరికి.. తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయన చుట్టూనే కొన్ని సర్వేలు సాగుతున్నాయి.
స్థానికంగా కొందరు చేయించిన సర్వేల్లో బాలినేని పరిస్థితి ఏంటో తేలిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోందని అంటున్నారు. బాలినేని పరిస్థితి ఆశించినట్టుగా అయితే లేదని సొంత పార్టీలోనే నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. బాలినేనికి ఇటీవల గడపగడపలోనూ కొంత చేదు అనుభవం కూడా ఎదురైంది.
వచ్చే ఎన్నికల్లో తన గెలుపు విషయాన్ని బాలినేని దగ్గర ఎవరైనా ప్రస్తావిస్తే.. ఆయన మౌనంగానే ఉంటున్నారు. పైగా.. ఇప్పుడే ఎందుకు? అని దాట వేస్తున్నారట కూడా. ఈ క్రమంలోనే లోకల్ ఛానెళ్లు కొన్ని.. ఇదే విషయంపై పరిశీలన చేసినప్పుడు .. బాలినేని హవా తగ్గినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఒంగోలు సిటీలో పరిస్థితి అటు ఇటుగా ఉందని అంటున్నారు. ఇక్కడ టీడీపీ హవా పుంజుకుందని.. చెబుతున్నారు.
అంటే.. 2014 సీన్ ఇక్కడ రిపీట్ కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. ఒంగోలు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలోనూ టీడీపీ గాలి వీస్తోందని తాజాగా ఒక అంచనా. మరోవైపు.. నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండడం.. దీనిని మరింత పెంచుతుందనే అంచనాలు వస్తున్నాయి. అంటే.. మొత్తంగా చూసుకుంటే.. ఇప్పటి నుంచి టీడీపీ కనుక ఒకింత కష్టపడితే.. బాలినేని హవా మరింత తగ్గుతుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 2, 2023 6:11 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…