Political News

జగన్ సభ.. అధికారుల తిప్పలు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా ఇప్పుడు జనం రావడం లేదు. జనాన్ని తోలేందుకు అధికారులు, అధికార పార్టీ వారు చేయని ప్రయత్నం లేదు. జగన్ పేరు చెబితే సభకు వచ్చేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ కూడా ఊపందుకుంది..

తెనాలి సభ

గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమాలకు జనాన్ని తరలించే ప్రక్రియలో అధికార వర్గాలకు తల ప్రాణం తోకకు వచ్చింది. ముందు రోజు నుంచి బస్సులను సిద్ధం చేసినా వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దానితో డ్వాక్రా సంఘాలంతా విధిగా హాజరు కావాలంటూ విప్ జారీ చేసినంత పని చేశారు. పైగా సభ దగ్గర డ్వాక్రా సంఘాలు గ్రూపు ఫోటో తీసుకుని అప్ లోడ్ చేయాలని కూడా ఆదేశించారు. అలాగైనా భయపడి మహిళలు వస్తారని వారి నమ్మకం కావచ్చు..ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు ఇంటి నుంచి తీసుకెళ్లి, మళ్లీ ఇంట్లో దిగబెట్టే బాధ్యతను కూడా అధికారులు తీసుకున్నప్పటికీ ప్రజాస్పందన అంతంతమాత్రంగానే ఉంది..

జగన్ మాట్లాడుతుండగానే..

గతంలో జరిగిన కొన్ని సభల్లో సీఎం జగన్ మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోవడం మొదలు పెట్టారు. అలా వందలమంది వెళ్లిపోతుంటే అధికారులు విస్తుపోయి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. జగన్ మంచి స్పీకర్ కాకపోవడం, జనం పై సమ్మోహనాస్త్రాలు వేయలేకపోవడంతో బోర్ కొట్టి ప్రజలు వెళ్లిపోతున్నారని కూడా టాక్ నడిచింది.

ఆపుతున్న పోలీసులు

జనం వెళ్లిపోకుండా ఆపాల్సిన బాధ్యతను కొన్ని సభల్లో పోలీసులకు అప్పగించారు. దానితో ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర అడ్డం నిల్చున్న పోలీసులు జనం వెళ్లిపోకుండా ఆపిన సందర్భం ఉంది. తోసుకుని వెళ్లాలనుకునే వారిపై సామదానభేదదండోపాయాలను కూడా వినిపోగించారు. అయితే భరించలేక కొందరు బ్యారికేడ్ల పై నుంచి దూకి వెళ్లిపోయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి.

నిరసనల భయం

వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో సభల్లో నిరసనల భయం కూడా నెలకొంది ఎక్కడ నల్ల జెండాలు చూపిస్తారోనని పోలీసులు తెగ జాగ్రత్త పడ్డేవారు. మహిళలు, అమ్మాయిలు నల్ల చున్నీలతో వచ్చినా వాటిని బయటపెట్టమని చెప్పి పంపించేవారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు తమ చున్నీలను బయట పెట్టేసి వెళ్లడం తీవ్ర చర్చకు దారి తీసింది.అయినా వైసీపీ ప్రభుత్వ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు…

This post was last modified on February 28, 2023 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago