ఏపీలో పోలీసు వ్యవస్థపై అనేక విమర్శలువస్తున్నాయి. ఆ జిల్లా .. ఈ జిల్లా.. అనే తేడా లేదు. దాదాపు చా లా వరకు జిల్లాల్లో సీఐ స్థాయి పోలీసులు.. ఇష్టాను రీతిలో వ్యవహరిస్తున్నారనే కామెంట్లు పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి వారంతా..రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇవే సందేహాలు వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే.. ప్రధానంగా నాలుగు జిల్లాల సీఐలు..రాజకీయంగా తీవ్ర విమర్శలకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని సీఐలు.. టీడీపీ నేతలపైనా..ఏకంగా చంద్రబాబు , నారా లోకేష్‌లపైనా.. దూకుడుగా వ్యవహరించి.. రాజకీయంగా విమర్శలు మోశారు. అయితే..దీనిపై మాజీ మంత్రి అమర్నాథ్ రియాక్ట్ అవుతూ.. వీరంతా కూడా ఉద్దేశ పూర్వకంగానే వ్యవహరిస్తున్నారని చెప్పారు.
గత 2019 ఎన్నికలకు ముందు హిందూపురం సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ ఇలానే దూకుడుగా వ్యవహరించి రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీ టికెట్ దక్కించుకున్నారని.. ఇప్పుడు ఈ సీఐలు కూడా ఇదే బాటలో ఉన్నారని.. ఆయన విమర్శించారు. అయితే.. ఇది అన్ని వేళలా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రేపు టీడీపీ ప్రభుత్వంవస్తే.. తిప్పేందుకు మీసం.. కొట్టేందుకు లాఠీ కూడా ఉండవన్న విషయాన్ని గుర్తించాలని ఆయన హెచ్చరించారు. దీనిని బట్టి.. మరి ఖాకీలు మారతారో..లేక తమ పంథాను కొనసాగిస్తారో చూడాలి. దీనిపై నెటిజన్లు కూడా ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు.
This post was last modified on February 27, 2023 2:07 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…