రాజకీయాల్లో నేతలను నమ్మాలి. అది పార్టీ అధినేతల కర్తవ్యం కూడా. నాయకులను నమ్మితేనే కదా.. టికెట్‌లు ఇస్తారు. సో.. రాజకీయాల్లో నమ్మకం అనేది తప్పదు. అయితే.. ఈ నమ్మకం ఎంత వరకు ఉండాలి? అనేది కీలకం. ఇక్కడే ఇతర పార్టీలకు.. వైసీపీ అధినేతకు మధ్య చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఎవరిని ఎంత వరకు నమ్మాలో.. అంత వరకే నమ్ముతున్నారు జగన్. ఎక్కడా కూడా పూర్తిగా నాయకులకు పగ్గాలు ఇవ్వరు.
దీనిపై విమర్శలు ఉన్నాయి. జగన్ నాయకులకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదని..కనీసం మాట్లాడనివ్వడం లేదని కూడా తరచుగా దుయ్యబడుతున్నారు. అయితే.. ఇలా ఫ్రీడమ్ ఇచ్చిన పార్టీల పరిస్థితి ఏంటి? అనేది చూస్తే.. జగన్ చేస్తున్నది కరెక్టేనేమో.. అనిపిస్తుంది. ఉదాహరణకు టీడీపీనే తీసుకుంటే..గన్నవరం నియోకవర్గంలో ఎమ్మెల్యే వంశీకి ఫ్రీహ్యాండ్ ఇచ్చింది. ఆయన ఇష్టానికి వదిలేసింది.
దీంతో పార్టీని బాగానే డెవలప్ చేసి.. దాని మాటున తాను కూడా డెవలప్ అయిపోయారు. వంశీ అంటే.. టీడీపీ పోయి.. వంశీ అంటే.. గన్నవరం.. గన్నవరం అంటే.. వంశీ అనేలా పరిస్థితి మారిపోయింది. ఇది.. టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఇప్పుడుఇక్కడ టీడీపీ అంటే.. వంశీనే అనుకునే పరిస్థితి రావడానికి కారణం.. పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఫ్రీహ్యాండే. అదేవిధంగా గతంలో గుడివాడ. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కన్నా నాయకులు బలం పుంజుకున్నారు.
ఇది పార్టీకి చేటు తెచ్చింది. ఫలితంగా పార్టీ కన్నా .. నాయకులు ఎదిగిపోయారు. వారు పార్టీని శాసించే పరిస్థితి వచ్చేసింది. దీనిని ముందుగానే గ్రహించిన జగన్.. ఎక్కడా కూడా నాయకులకు ఎంత వరకు ఫ్రీ ఇవ్వాలో అంతే ఇస్తున్నారు. తప్ప. ఒక్క అంగుళం కూడా స్వేచ్ఛ ఇవ్వకుండా చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. అందుకే.. గత ఎన్నికల్లోనూ.. ఇప్పుడు కూడా.. పార్టీని చూసి ఓటేసే పరిస్థితి ఉంది తప్ప.. నాయకులను చూసి ఓటే సే పరిస్థితి వైసీపీలో లేదు. ఇదీ.. జగన్ వ్యూహం.
This post was last modified on February 26, 2023 9:35 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…