టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్రలో జోరుగా ముం దుకు సాగుతున్నారు. అయితే.. ఈ సందర్భంగా నారా లోకేష్ చేసిన ఒక సంచలన వ్యాఖ్య రాజకీయంగా దుమారానికి దారి తీసింది. అదే… జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నానని.. ఆయన చెప్పారు. అయితే.. దీనిపైవెంటనే రియాక్ట్ అయిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ విశ్వాసపాత్రుడిగా ఉన్న వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అసలు పార్టీనే నందమూరి కుటుంబానిదని.. తాత ప్రారంభించిన పార్టీ.. తండ్రి హరికృష్ణ.. 40 వేల కిలో మీటర్ల మేరకు చైతన్య రథాన్ని నడిపి.. పార్టీని డెవలప్ చేశారని.. అలాంటి పార్టీలోకి జూనియర్‌ను ఆహ్వానించడం ఏంటి? అనేది వీరి లాజిక్. అంతేకాదు.. సొంతింట్లోకి జూనియర్‌కు స్వాగతం పలకడానికి నారా లోకేష్ ఎవరని కూడా వ్యాఖ్యానించారు. అయితే.. ఇది రాజకీయంగా మాట్లాడుకునేందుకు.. బాగానే ఉంది.
కానీ, టెక్నికల్‌గా ఆలోచిస్తే.. మాత్రం నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదనే అంటున్నారు పరిశీలకు లు. ఎందుకంటే.. పార్టీని నేనే స్థాపించానని చంద్రబాబుకానీ, నారాలోకేష్ కానీ, ఎక్కడా క్లెయిమ్ చేసుకోలేదు. అంతేకాదు.. వ్యవస్థాపక అధ్యక్షుడిగా అన్నగారు ఎన్టీఆర్‌కు సముచిత గౌరవం ఇస్తున్నారు. ఇచ్చారు.. కూడా ప్రస్తుతం శత జయంతి ఉత్సవాలు కూడా చేస్తున్నారు. ఆయన పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.
సో.. ఆయనకు ఎక్కడా గౌరవ భంగం కలిగించే ప్రయత్నం చేయలేదు. ఇది.. ఎన్టీఆర్ అభిమానులకు సంతృప్తిగానే ఉంది. ఇక, పార్టీని ఎవరు సొంతం చేసుకోవాలి.? అనే విషయాన్ని పరిశీలిస్తే.. నందమూరి కుటుంబమే.. పార్టీని వద్దనుకుంది! ఇది నిష్టురసత్యం. ఎవరు ఏమనుకున్నా.. పార్టీని డీల్ చేసే పరిస్థితి ఈ కుటుంబానికి వ్యాపారాలు.. సినిమా రంగంతో ఉన్న బిజీ కారణంగా.. వదులుకున్నారు. పైగా.. రాజకీయాలు చేయాలంటే.. అనేక వ్యూహాలు ఉండాలి.. అనాలి.. అనిపించుకోవాలి.
అయితే.. నందమూరి కుటుంబం ఆదినుంచికూడా.. సునిశితంగా పెరిగింది. అన్నగారు కూడాఎవరినీ పన్నెత్తు మాట అనలేదు.. అనిపించుకోలేదు. హరికృష్ణ అయినా. అంతే. ఎప్పుడూ విమర్శల జోలికిపోలేదు. రాజకీయాలను కూడా చాలా గౌరవంగా చూశారు.కానీ, గత రెండు దశాబ్దాలుగా రాజకీయాలు పెడదారి పట్టాయి. అన్నీ వదలేసిన వారే రాజకీయాల్లో వున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అలాంటి రాజకీయాలు వద్దనుకున్న నందమూరి కుటుంబమే రాజకీయాలకు దూరంగా ఉందని.. పరిశీలకులు భావిస్తున్నారు. కావాలని అనుకున్న బాలయ్యకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదా? ఇటీవల మరణించిన తారకరత్న వస్తే.. టికెట్ ఇచ్చేది లేదు పొమ్మన్నారా? సో.. లోకేష్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏమాత్రం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 26, 2023 9:31 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…