Political News

‘ఆంధ్రా మీడియా’ ఇప్పుడు పర్వాలేదా కేసీఆర్

పరిధితో సంబంధం లేకుండా పరిమితుల్ని పెట్టుకోవటం కొన్నిసార్లు చూస్తుంటాం. అదే సమయంలో పరిమితుల్ని తమ సౌలభ్యాలకు అనుగుణంగా మార్చుకునే తీరు కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ గుణం కాస్త ఎక్కువ. తన రాజకీయ అవసరాల కోసం ఏ మాటనైనా మాట్లాడేస్తుంటారు. అప్పటివరకు ఆంధ్రోళ్లు రాక్షసులు.. పిశాచులు అనేసి.. అంతలోనే వారి కాళ్లలో ముళ్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తాననే చతురత ఆయనకు మాత్రమే సొంతం. అవసరమైనప్పుడు కౌగిలించుకోవటం.. కాదనుకున్నప్పుడు తోసి పక్కకు పడేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

చంద్రబాబును బండ బూతులు తిట్టేసే కేసీఆర్.. అదే బాబుతో తనకు రాజకీయ ప్రయోజనం ఉందని భావించినప్పుడు ఆయన నోటి వచ్చిన మాటలు యూట్యూబ్ లో పాత వీడియోల్ని చూసినప్పుడు అర్థమవుతుంది. ఇదంతా ఎందుకంటే.. కాలానికి అనుగుణంగా తన వ్యూహాల్ని మార్చుకునే కేసీఆర్ కు ఇప్పుడు ఫోకస్ అంతా జాతీయరాజకీయాల మీద పడింది. అందులో భాగంగా తాను పేరు మార్చిన బీఆర్ఎస్ వేదిక మీద కొత్త తరహా రాజకీయాలకు తెర తీశారు.

వివిధ రాష్ట్రాల్లోని కొందరు అధినేతలను చేరదీసి వారికి తాను ఆర్థిక సాయం చేస్తానని చెబుతూ.. తమ పార్టీని వేళ్లూరుకునేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోనూ బీఆర్ఎస్ శాఖను ఓపెన్ చేశారు. ఉద్యమ సమయంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా పేరుతో ఆయన ఎన్నేసి మాటలు అన్నది తెలిసిందే. తనకు నష్టం వాటిల్లేలా కథనం పబ్లిష్ అయిన వెంటనే సదరు మీడియా సంస్థలోని ‘ఆంధ్రా’ మూలాల్ని వెతికే ప్రయత్నం చేసి.. అదే అస్త్రాన్ని ఆయన సంధిస్తుంటారు.

మరి అంతలా ఆంధ్రా పేరుతో తెలంగాణ సెంటిమెంట్ రగిలించే కేసీఆర్ కు ఇప్పుడు ఏపీ మీద ప్రేమ పొంగుకొచ్చింది. మాజీ సివిల్స్ అధికారితో పార్టీ రాష్ట్ర శాఖను ఏర్పాటు చేయటం ద్వారా వచ్చే ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తన మీడియా సంస్థ అయిన నమస్తే తెలంగాణకు.. ఏపీకి తగ్గట్లు నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో దినపత్రికను తీసుకొస్తున్నారు. మరి.. ఇంతకాలం ఆంధ్రా అని నోరు పారేసుకున్న కేసీఆర్.. ఇప్పుడేం చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. ఏ ఆంధ్రా ప్రాంతాన్ని.. ఏ ఆంధ్ రాప్రజల్ని తిట్టారో అదే ప్రజలకు తన పేపర్ ద్వారా రాజకీయాల్ని బోధించాలనుకునే కేసీఆర్ ప్లానింగ్ చూసినప్పుడు ఆయన గడుసు తనానికి కాస్తంత ఆశ్చర్యపోవాల్సిందే.

కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా పేపర్ పెట్టటం ద్వారా తన పరిధుల్ని తానే తగ్గించుకుంటున్నారని చెప్పాలి. ఆయన మీడియా సంస్థ ఏమో కానీ.. తెలంగాణలో తన ప్రభుత్వ పని తీరును తప్పు పట్టే వారిని.. వేలెత్తి చూపించే వాళ్లను ఆంధ్రా మీడియా అంటూ ఫైర్ అయ్యే అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకుంటున్నట్లేనని మాత్రం చెప్పక తప్పదు.

This post was last modified on February 26, 2023 2:21 pm

Share
Show comments
Published by
Satya
Tags: FeatureKCR

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago