ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు మార్మోగుతోంది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు హాత్ సే హాత్ జోడో యాత్రను నిర్వహి స్తున్నారు. ఈ సందర్భంగా ఒక్క చాన్స్
ప్లీజ్ అంటూ.. ప్రజలను అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో ప్రగతిని సాధిస్తామని.. ప్రగతిని చూపిస్తామని.. రేవంత్‌పేర్కొంటున్నారు.
అదేసమయంలో నియోజకవర్గాల పర్యటనలో భాగంగా.. ఏ నియోజకవర్గానికి వెళ్తే.. అక్కడి ఎమ్మెల్యేపై చార్జ్ షీట్‌ను ప్రజలకు వివరిస్తున్నారు. నియోజకవర్గం లోపాలను కూడా రేవంత్ ఎత్తి చూపుతున్నారు. ఇక, యువతను ఆకర్షించేందుకు.. ఉద్యోగాలు.. పేదలను ఆకట్టుకునేందుకు పథకాలు.. ఇలా.. అన్ని రూపాల్లోనూ రేవంత్ దూకుడు పెంచారు. ఇక, పార్టీ నాయకులు కూడా ఆయనకు కలిసి వస్తున్నారు.
ఇలా.. అన్ని రూపాల్లోనూ రేవంత్‌దూకుడు పెంచడంతో. మరోవైపు అధికార పార్టీ నేతలు కూడా నియోజ కవర్గాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్.. రేవంత్ పర్యటనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన ఇస్తున్న హామీలు.. పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్.. ఇలా అనేక విషయాలను కేటీఆర్ పరిగణ నలోకి తీసుకున్నారు. దానికి తగిన విధంగా కౌంటర్లు కూడా ఇస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ దూకుడు పెంచడం.. పాదయాత్ర చేస్తుండడం వంటివి రాజకీయంగానే కాకుండా.. స్థానికంగా కూడా చర్చకు దారితీస్తోంది. ప్రతి విషయంలోనూ రేవంత్ స్పందిస్తు న్న తీరు.. పార్టీలోనూ జోష్ నింపుతుండడం గమనార్హం. దీంతో సహజంగానే అధికార బీఆర్ ఎస్‌లో గుబులు రేపుతోంది. దీంతో మంత్రి కేటీఆర్ విరుగుడుగా.. మరోవైపు సభకు సమావేశాలునిర్వహిస్తుండడం గమనార్హం.
This post was last modified on February 27, 2023 6:04 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…