వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబును బిజీ బిజీ చేయడమే వైసీ పీ అధినేత, సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఒకటి వదిలితే ఒకటి.. చంద్రబాబుకు పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి. నిజానికి చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23 నుంచి అంటే.. గురువారం నుంచి కూడా ఉత్తరాంధ్రలో పర్యటించాల్సి ఉంది. ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది.
అయితే.. అనూహ్యంగా తారకరత్న మరణంతో అక్కడకు వెళ్లారు. దీనికి ముందు తూర్పు గోదావరి జిల్లాలో ని మూడు నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ చేపట్టారు. ఇక్కడ కూడా మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయలేక పోయారు చంద్రబాబు. పోలీసులు అడ్డంకులు సృష్టించారని.. తమ సభలను అడ్డుకుంటున్నారని.. పేర్కొంటూ.. ఫోకస్ అంతా కూడా వాటిపైనే పెట్టేశారు. దీంతో చంద్రబాబు లక్ష్యం కొట్టుకుపోయింది.
నిజానికి ఆయా కార్యక్రమాలపై టీడీపీ నేతలు.. శ్రేణులుకూడా చాలానే ఆశలు పెట్టుకున్నాయి. చంద్రబా బు కూడా.. అంశాల వారీగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి.. వాటిలో డొల్లతనాన్ని బయట పెట్టి.. తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, విషయం మాత్రం యూటర్న్ తీసుకుంది. కేవలం పోలీసులు.. వారి దాడులపైనే మూడు రోజులు చంద్రబాబు దృష్టి పెట్టారు. ఫలితంగా అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి అన్నట్టుగా మారిపోయింది.
ఇదిలావుంటే.. గురువారం నుంచి ప్రారంభించాల్సి ఉన్న మలివిడత.. ఇదేం ఖర్మ పూర్తిగా వాయిదా పడింది. గన్నవరం ఘటనతో చంద్రబాబు అక్కడ పర్యటనకు వెళ్లారు. పైగా.. ఇప్పుడు టీడీపీ నేతలను కాపాడు కోవాల్సిన.. వారికి అండగా నిలవాల్సిన పరిస్థితి కూడా చంద్రబాబుకు వచ్చింది. మరోవైపు.. తీరిక లేని ప్రయాణాలు.. ప్రసంగాలతో చంద్రబాబు అలిసిపోయే పరిస్థితి ఉందనే చర్చ కూడా వస్తోంది. మొత్తంగా చూస్తే.. జగన్ వ్యూహంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతుండడం గమనార్హం.
This post was last modified on February 25, 2023 2:48 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…