వైనాట్ 175– నినాదంలో రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను కూడా సొంత చేసుకోవాలని.. వైసీపీ అధినేత, సీఎం జగన్ భావించారు. అందుకే తరచుగా పార్టీ నాయకులకు ఆయన హితవు పలుకుతున్నా రు. పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. తన చేతుల్లో ఏమీ లేదని కూడా కుండబద్దలు కొడుతున్నారు. అయితే.. అనుకున్న విధంగా అయితే.. నిన్న మొన్నటి వరకుఉందని భావించినా.. ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు.
ఏపీలో రాజకీయం చాలా అనూహ్యంగా మారిపోతోంది. మూడు ప్రాంతాల్లోనూ వైసీపీకి సెగ పుట్టించేలా రాజ కీయాలు వేడెక్కుతున్నాయి. అంతకాదు.. కీలక నాయకులను.. టీడీపీ అధినేత చంద్రబాబు ఒడిసి పట్టు కుంటున్నారు. పాత విభేదాలు పక్కన పెట్టి.. కొత్త పొత్తులకు తెరదీస్తున్నారు. పలితంగా అనూహ్యరీతిలో వైసీపీకి సెగ పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వైసీపీకి ఎదురు లేదని భావించిన వారు కూడా.. పరిస్థితులు అనుకూలంగా లేవనే అంచనాలకు వస్తున్నారు.
ఉత్తరాంధ్రలో జనసేన దూకుడు పెంచింది. పార్టీ అధినేత పవన్ తరచుగా అక్కడ పర్యటిస్తున్నారు. దీంతో వైసీపీకి ఉన్న సింపతీ ఓటు బ్యాంకు.. తర్జన భర్జనలో పడింది. మరో రెండు సార్లు కనుక .. అక్కడ పవన్ పర్యటిస్తే.. వైసీపీకి వ్యతిరేకత మరింత పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇక, కీలకమైన నెల్లూరు రెడ్లు కూడా యూటర్న్ తీసుకున్నారనే సమాచారం తరచుగా వినిపిస్తూనే ఉంది.
నెల్లూరు రెడ్లు ఆనం వర్గంగా ఉంటారు. ఎందుకంటే.. ఆనం కుటుంబం నిలకడైన రాజకీయాలు చేసిందనే పేరుంది. టీడీపీతోనే ప్రస్థానం ప్రారంభించినా.. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం ఉండడంతో ఆనం వర్గానికి బలమైన రెడ్డి మద్దతు ఉంది. ఇప్పుడు ఆనం టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో రెడ్డి వర్గంలోనూ వైసీపీపై అసహనం ఉండడంతో .. ఈ వర్గం యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, కాపు సామాజిక వర్గంలో పేరున్న కన్నా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గుంటూరు రాజకీయాల్లో వైసీపీకి పెను కుదుపు చోటు చేసుకుందనే చర్చ ప్రారంభమైంది. మరోవైపు.. అమరావతి రాజధాని రైతులు కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తున్నారు. వీరి ప్రభావం కేవలం ఒక్క గుంటూరుతోనే ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. సమీపంలోని నాలుగు నుంచి ఐదు ఉమ్మడి జిల్లాలపై రాజధానని ప్రభావం ఉంది. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు ఉన్న వేడి వేరు.. ఇక నుంచి జరిగే రాజకీయాలు రూటు వేరని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 25, 2023 11:09 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…