టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో ఆయన వివిధ వర్గాల వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారికి అండగా ఉంటానని చెబుతున్నారు. ఇక, ఇదేసమయంలో నారా లోకేష్ పలు హామీలు కూడా గుప్పిస్తున్నారు. ఇక, ఏ సమూహంతో మాట్లాడితే.. వారి సమస్యలను ప్రస్తావిస్తుండడం గమనార్హం.
ఈ క్రమంలోనే తాజాగా నారా లోకేష్ నోటి వెంట మెగాస్టార్ గురించిన మాట వినిపించింది. మెగాస్టార్ చిరంజీవికి తాను అభిమానినని.. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూశానని లోకేష్ అన్నా రు.. పాదయాత్రలో భాగంగా ఆయన తాజాగా తిరుపతిలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఐ.ఐ. ఎం ప్రొఫెసర్ రాజేశ్‌తో పాటు పలువురు యువతీయువకులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ ముఖాముఖి లో సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా మెగా స్టార్ చిరు గురించి మాట్లాడి అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. అయితే.. దీని వెనుకు యూత్‌ను ఆకర్షించే వ్యూహం ఉందని.. విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా రాజకీయంగా యూత్‌ను తనవైపు తిప్పుకునే పరిస్థితిని కూడా కల్పించుకున్నారి.. అంటున్నారు. కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడుతూ.. పోతే.. యూత్ కనెక్ట్ కావడం కష్టం కాబట్టి.. నారా లోకేష్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెబుతున్నారు.
యువగళానికి ఇలాంటి ఘటనలు చాలా తోడ్పాటును అందిస్తాయని అంటున్నారు. యువగళంలో ఇలాం టి కామెంట్లు.. ముఖ్యంగా నేటివిటీకి.. ప్రస్తుతం జరుగుతున్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. పార్టీని ముందుకు నడిపించేందుకు అవకాశం ఉంటుందని లోకేష్ ఇదే చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 25, 2023 10:28 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…