పెళ్లికే కాదు… పోరుకు కూడా లగ్గం పెట్టాల్సిందేనా.. అప్పుడే పోటీ రసవత్తరంగా ఉంటుందా. కొన్ని గంటలుగా ఈ చర్చ ఏపీ రాజకీయాల్లో ఊపందుకుంది. నేరుగా కొట్టుకుందాం రా… అని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాలు విసిరారు. వైసీపీ అరాచకాలకు చరమగితం పాడే సమయం వచ్చిందని తేల్చిన చంద్రబాబు.. ఇక వన్ టు వన్ ఫైట్‌కు రెడీ అవుతున్నట్లు నేరుగానే ప్రకటించారు…
ఈ నెల 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయం పై వైసీపీ దాడి చేసి విధ్వంసం సృష్టించడంతో పాటు, స్థానిక టీడీపీ నేత దొంతు చిన్నా పై దాడి చేసి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి చంద్రబాబు మనోధైర్యం కల్పించారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, ఎటువంటి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అనంతరం వైసీపీ నాయకుల దాడిలో విధ్వంసానికి గురైన గన్నవరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంతో పాటు, దగ్దం చేసిన టీడీపీ నేతల వాహనాలను ఆయన పరిశీలించారు.
గన్నవరం కార్యాలయం పై దాడి జరిగి ఐదు రోజులు గడిచినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, టీడీపీ నాయకుల పైనే కేసులు పెట్టి వేదించడం సరైన పద్దతి కాదని చంద్రబాబు మీడియాతో అన్నారు. తనను గన్నవరంలో పర్యటించొద్దని చెప్పడానికి పోలీసులెవరని, గన్నవరం ఏమైనా పాకిస్థాన్ లో ఉందా అని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు సిగ్గు మాలిన పనులు చేస్తున్నారని, వారి కుటుంబ సభ్యుల వద్ద అయినా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చేసే ఉద్యమంలో అంతా ఐక్యం కావాలని, ఇందుకు ప్రజా ఉద్యమ రూపకల్పనకు ప్రజలే శ్రీకారం చుట్టాలన్నారు.
ఒక సందర్భంలో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. వైసీపీపై నిప్పులు చెరిగారు. దొంగ దెబ్బలు, దొంగ ఆటలు వద్దని హెచ్చరించారు. లగ్గం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందామని సవాలు చేశారు. పోలీసులు లేకుండా రావాలని, ధైర్యం ఉంటే సైకోని కూడా రమ్మనాలని చంద్రబాబు అన్నారు. ఇక తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చిందని చంద్రబాబు డిసైడయ్యారు. నిజానికి ఇదీ వైసీపీలోని చిన్నా చితకా నేతలకు చంద్రబాబు చేసిన సవాలు కాదు. నేరుగా సీఎం జగన్‌కు చేసిన సవాలు. మరి ముఖ్యమంత్రి స్పందిస్తారో లేదో చూడాలి…
This post was last modified on February 24, 2023 8:59 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…