వైసీపీ అధినేత, సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆయన ఏకంగా 175 కు 175 సీట్లలోనూ విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు సాగుతున్నారు. అయితే… ఈ ఫార్ములా ను సొంతం చేసుకోవడం.. అంటే 175 సీట్లలోనూ విజయం దక్కించుకోవడం అంత ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు.
అందుకే.. జగన్ వ్యూహాలపై వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థను సంపూర్ణంగా వాడుకున్నారు. వీరి ద్వారా ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య ఏం జరుగుతున్నా తెలిసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక, ఇప్పటికే.. తన పార్టీ నాయకులు. ఎమ్మెల్యేలు, మంత్రులను గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక, సొంత సర్వేల ద్వారా.. ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఎవరికి వద్దు అనేది కూడా తేల్చేస్తున్నారు.
అంటే ఒకరకంగా.. వైసీపీ అధినేత చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూనే.. మరోవైపు.. పథకాలు అమలు చేస్తూనే.. ఇంకోవైపు.. నలుమూలల నుంచి కూడా వ్యూహాత్మకంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఫలితంగా..వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలుచుకునే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, ఈ క్రమంలోనే గృహ సారథులు అనే కాన్సెప్టు కూడా త్వరలోనే పట్టా లెక్కనుంది.
అయితే.. వీటిని గమనిస్తున్న టీడీపీ నేతలకు.. సందేహాలు ముసురుకున్నాయి. మనకు ఇన్ని వ్యూహాలు లేవు.. ఇప్పుడు ఏం చేయాలని వారు ఆలోచన చేస్తున్నారు. అయితే..ఇటీవల చంద్రబాబు జగన్ తెచ్చిన గృహ సారథుల కాన్సెప్టుకు సమానంగా.. ఇంచార్జ్ సారథులు.. అనే కొత్త పేరుతో ఆయన వ్యవస్థను ఏర్పా టు చేశారు. ఇంతకుమించిన వ్యూహం అయితే.. కనిపించడం లేదు. దీంతో జగన్ వ్యూహాలకు చంద్రబాబు చాలా దూరంగా ఉన్నారనే భావన టీడీపీలో వ్యక్తమవుతుండడం గమనార్హం.
This post was last modified on February 24, 2023 1:15 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…