ఏపీ బీజేపీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా పెల్లుబిక్కింది. పార్టీ మాజీ నేత కన్నా లక్ష్మీ నారాయణ, టీడీపీలో చేరిన రోజే కొందరు రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారు. జమ్ముల శ్యామ్ కిషోర్, చిగురుపాటి కుమారస్వామి, తుమ్మల అంజిబాబు, ధారా సాంబయ్య, బాలకోటేశ్వరరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, శ్రీమన్నారాయణ, సుబ్బయ్య, చిలుకుపాటి కుమారస్వామి, హనుమంతు ఉదయ్ భాస్కర్ సహా పలు జిల్లాల మాజీ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు తో సహా 30 మంది నేతలు ఢిలీ వెళ్లారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ అయిన కేంద్ర మంత్రి మురళీధరన్‌ను కలిసి తమ వాదనను వినిపించారు.
విచిత్ర వాదన
మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన రాష్ట్ర నేతలు విచిత్రంగా మాట్లాడారు. సోము వీర్రాజును మార్చకపోయినా ఫర్యాలేదని ఆయన వైఖరి మారితే చాలునని, అందరినీ గౌరవించాలని కోరినట్లు చెప్పారు. ఇంతదూరం ఎందుకొచ్చారు.. నేను రాష్ట్రానికి వచ్చినప్పుడు మాట్లాడుకునే వాళ్లం కదా అని మురళీధరన్ వారితో అన్నారట. నాయకత్వ మార్పు తన చేతుల్లో లేదని తేల్చేసిన మురళీధరన్.. తొందరపడ వద్దని సున్నితంగా రాష్ట్ర నేతలను హెచ్చరించారు.
టీడీపీతో పొత్తు వద్దని చెప్పాం..
మాటలో మాటగా టీడీపీతో పొత్తు వద్దని తామె చెప్పినట్లు రాష్ట్ర నేతలు ప్రకటించారు. నిజానికి అదంతా అధిష్టానం డైరక్షన్ అని తెలుస్తోంది. మురళీధరనే ఆ సంగతి ప్రస్తావించి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయని అడిగారట. వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో లేదో తెలీదు కానీ.. టీడీపీతో పొత్తు వద్దని చెప్పేశారట. చెప్పీ చెప్పకుండా మీడియా ముందు ఈ సంగతి వదలాలని రాష్ట్ర నేతలను మురళీధరన్ ఆదేశించారట. దానితో బయటకు వచ్చిన ఆ నేతలు అదే మాటను ఉన్నది ఉన్నట్లనుగా చెప్పేసి.. చల్లగా జారుకున్నారు. మరి అది బీజేపీ అఫిషియల్ స్టాండా లేక.. అలా వదిలి రియాక్షన్ చూస్తున్నారా తెలియాల్సి ఉంది. దీనిపై టీడీపీ ప్రతిస్పందన ఏమిటో చూడాలి…..
This post was last modified on %s = human-readable time difference 1:05 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…