ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఎవరికీ సహజంగా నమస్కారమే చేయరని పేరుంది. అయితే.. కొందరు దీనికి మినహాయింపు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మిత్రుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వంటివా రికి మాత్రం ఆయన మనస్పూర్తిగా నమస్కారం చేస్తారు. ఇక, పాదనమస్కారం అనేది అసలు జగన్‌ను ఊహించలేం. అప్పుడెప్పుడో ఒకే ఒక్కసారి.. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన రామ్‌నాథ్ కోవింద్‌కు మాత్రం చేశారు.
నేరుగా రాష్ట్రపతి భవన్‌కువెళ్లి ఆయనకు పాదనమస్కారం చేయడం.. పెద్ద విమర్శలకు దారితీసింది. ఇక, ఆతర్వాత..ఎక్కడా జగన్ ఎవరి పాదాలకు నమస్కారం చేసినట్టు వార్తలు కూడా రాలేదు. ఇక తనకుఎంతో ఇష్టమైన విశాఖలో చినముషిడివాడ శారదా పీఠాధిపతికి కూడా జగన్ పాదనమస్కారాలు చేసినట్టు లేదు. అఅయితే.. అనూహ్యంగా రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్‌కు జగన్ తొలిసారి పాదనమస్కారం చేశారు.
అదికూడా.. ఆయన ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ అయిపోయి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్ర యంలో విశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు జగన్ తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్ఛం ఇచ్చి.. శాలువా కప్పి.. అనంతరం పాదాలకు వంగి నమస్కరించారు. ఈ దృశ్యం
లైవ్‌లో చూసిన వారికి ఆశ్చర్యంతో పాటు విస్మయం కూడా కలిగింది. సాధారణంగా జగన్ ఎవరికీ నమస్కారమే పెట్టరు కదా.. ఇలా చేయడం ఏంటాని అనుకున్నారు.
దీనిపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. గవర్నర్ రుణం తీర్చుకునేందుకు జగన్ ఇలా పాదనమస్కా రం చేసి ఉంటారని అంటున్నారు. జగన్ నిర్ణయాలు అనేక వివాదాస్పదం అయ్యాయని.. వీటిపై ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో గవర్నర్‌కు పిర్యాదు చేశాయని.. అయినా..ఆయన ఎక్కడా వాటిని పట్టించుకోకుండా.. జగన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. నెటిజన్లు పేర్కొన్నారు. అందుకే ఆ రుణం తీర్చుకునేందుకు పాదనమస్కారం చేసి ఉంటారని.. నవ్వులు చిందిస్తున్నారు.
This post was last modified on February 22, 2023 3:39 pm
సీనియర్ స్టార్ హీరోల్లో వరసగా మూడు బ్లాక్ బస్టర్లున్న హీరో ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కరే. రెండో హ్యాట్రిక్ కు శ్రీకారం…
కార్పొరేట్ కంపెనీలు ఇటీవల కాలంలో పని ఒత్తిడితో పాటు టైమ్ ను కూడా మెల్లగా పెంచుతున్న విధానంపై తీవ్ర స్థాయిలో…
వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు టోకెన్ తీసుకోవాలని వచ్చి.. తిరుపతిలో జరిగిన తొక్కిస లాటలో ప్రాణాలు కోల్పోయిన…
ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు వారి వార్షిక వేతనంలో భారీ పెంపు కలిగింది.…
వరల్డ్ క్రికెట్ లో కీలక సిరీస్ గా పరిగణిస్తున్న చాంపియన్స్ ట్రోఫీకి మరెంతో సమయం లేదు. పిబ్రవరిలో ఈ సిరీస్…
నితిన్ గడ్కరీ... కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిగా పదేళ్లకుపైగా కొనసాగుతున్నారు. మోదీ కేబినెట్ లో ఆ శాఖను…