Political News

కాపుల కోటలో వెలమదొర.. సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారా?

ఏలూరు ఎంపీ, వైసీపీ నేత కోటగిరి శ్రీధర్ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగుతారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ మార్పులు ఆళ్ల నానికి అనుకూలం కావొచ్చేమో కానీ కోటగిరి శ్రీధర్‌కు ఏమాత్రం అనుకూలం కాదని.. ఏలూరు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ దాదాపు కాపులు బలంగా ఉన్నవేనని.. అక్కడ అసెంబ్లీకి పోటీ చేస్తే కోటగిరికి కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.

ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ వెలమ కులానికి చెందినవారు. ఏలూరు ఎంపీ సీటు పరిధిలో కాపు ఓటర్లే అధికంగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో వైసీసీ గాలి వీయడం.. క్రాస్ ఓటింగ్ జరగకపోవడంతో ఆయన సునాయాసంగా గెలిచారు. కానీ రానున్న ఎన్నికల్లో పరిస్థితి అలా ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఏలూరు పార్లమెంటు స్థానానికి కాకుండా నూజివీడు అసెంబ్లీకి పోటీచేయాలనుకుంటున్నారట.

ఏలూరు పార్లమెంటు సీటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఉంగటూరు, దెందులూరు, ఏలూరు, కైకలూరులలో కాపు జనాభా అధికం. పోలవరం, చింతలపూడిలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఇక మిగిలిని నూజివీడు నియోజకవర్గంలో మాత్రం వెలమల సంఖ్య ఎక్కువ. దీంతో నూజివీడు అసెంబ్లీ నియోజవకర్గంలో పోటీ చేయడానికి శ్రీధర్ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. ఎంపీగా నియోజకవర్గంలో పాల్గొంటున్న కార్యక్రమాలు కూడా ఎక్కువగా నూజివీడులోనే ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

పార్టీ అధిష్టానం దగ్గర కూడా శ్రీధర్ ఇప్పటికే తన ఆలోచన చెప్పారని, కానీ, ఇంకా ఆమోద ముద్ర రాలేదని తెలుస్తోంది. అయితే… వచ్చే ఎన్నికల్లో కుల సమీకరణలు కీలకం కావడంతో కోటగిరి ప్లానుకు అధిష్ఠానం ఓకే చెప్పొచ్చని భావిస్తున్నారు. అయితే… నూజివీడు నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే మేకా వెంకట అప్పారావును కాదని కోటగిరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

This post was last modified on February 21, 2023 8:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు…

18 mins ago

గేమ్ ఛేంజర్ మీద ఒత్తిడి షురూ

పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…

1 hour ago

‘పుష్ప-2’ ఈవెంట్లో రభస రభస

‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…

2 hours ago

మీనాక్షి.. హీరోల గురించి ఒక్క మాటలో

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…

2 hours ago

ద‌ర్శ‌కుడైతే ఎవరికెక్కువ..

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ద‌ర్శ‌కుడైనంత మాత్రాన చ‌ట్టాలు పాటించ‌రా? అని…

3 hours ago