రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా..టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని.. కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఎన్నికల కు సంబంధించి ఒక సర్వే రిపోర్టును మీడియాకు విడుదల చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కుప్పకూలడం ఖాయమని తెలిపారు. జగన్‌కు ఆయన పార్టీకి కేవలం 55 స్థానాల్లోనే విజయం దక్కుతుందని తేల్చి చెప్పారు.
జనసేన-టీడీపీ పొత్తుతో ఫలితాలు తారుమారు కావడం తథ్యమని వెల్లడించారు. టీడీపీ 70 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని జోగయ్య తెలిపారు. అదేసమయంలో జనసేన అధినేత పవన్ 50 స్థానాల్లో విజయం సాధిస్తారని.. దీంతో ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని వెల్లడించారు. వారాహి యాత్ర న ప్రారంభించడం ద్వారా.. ప్రజల్లో జనసేన ప్రభావం మరింత పెరుగుతుందని జోగయ్య వివరించారు.
ఒంటరిగా పోటీ చేస్తే..
ఒకవేళ ఎలాంటి పొత్తులూ లేకుండానే జనసేన ఎన్నికలకు వెళ్తే.. 20 స్థానాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతు ందని జోగయ్య అంచనా వేశారు. అలానే టీడీపీ కూడా ఒంటరి పోరు చేస్తే.. ఆ పార్టీకి 38 శాతం ఓట్లతో 55 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అధికార వైసీపీకి 47 శాతం ఓట్లతో 100 సీట్లు వస్తాయని లెక్క గట్టారు. ఇతరులకు 1 శాతం సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
వారాహి ఎఫెక్ట్ ఇదీ..
జనసేన అధినేత పవన్ వారాహి బస్సు యాత్ర ప్రారంభిస్తే.. భారీ మార్పులు చోటు చేసుకుంటాయని.. జోగయ్య అంచనా వేశారు. ఈ యాత్ర పూర్తయ్యే నాటికి జనసేన ఓట్ల శాతం 14 నుంచి 20 శాతానికి పెరిగి సీట్ల సంఖ్య 35కు పెరుగుతుందన్నారు. అలాగే టీడీపీకి వచ్చే ఓట్ల శాతం 38 శాతమే ఉంటుందని, కానీ 60 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక, అధికార పార్టీ వైసీపీ ఓట్ల శాతం 40 శాతానికి పడిపోతుందని తేల్చారు. సీట్లు 80కి తగ్గుతాయని పేర్కొన్నారు.
This post was last modified on February 21, 2023 1:36 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…