Political News

కాపుల ఓట్లు ఎటు… ఒక్క‌టే టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

కాపు ఓటు బ్యాంకుఎటు వైపు? రాష్ట్రంలో 25 శాతంగా ఉన్న కాపుల‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? ఎవ‌రు ప్రాధాన్యం ఇస్తున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. తాజాగా రెండు రోజుల కింద‌ట ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రిలో జ‌రిగిన కాపు నాడు స‌మావేశంలో ఎటు వైపు మొగ్గు చూపాల‌నే విష‌యంపై కాపులు దృష్టి పెట్టారు. ఇదిలావుంటే.. వైసీపీ, టీడీపీలు కూడా కాపుల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఎన‌లేని ప్రాదాన్యం ఇస్తున్నారు. నిజానికి టీడీపీలో కొంద‌రు కీల‌క నేత‌లు వ్య‌తిరేకిస్తున్నా.. క‌న్నాను పార్టీలో చేర్చుకునేందుకు చంద్ర‌బాబు మొగ్గు చూపారు. ఇది కాపుల‌ను త‌మ‌వైపు తిప్పుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ.. జ‌గ‌న్ కూడా కాపుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కాపులు.. క్ష‌త్రియులకు ఎమ్మెల్సీ కోటాల‌ను రిజ‌ర్వ్ చేసిన‌ట్టు చెబుతున్నారు.

రెండు సామాజిక వ‌ర్గాల‌కు రెండేసి చొప్పున ఎమ్మెల్సీ సీట్ల‌ను ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. త‌ద్వారా.. కాపుల‌ను, మ‌రో కీల‌క సామాజిక వ‌ర్గం క్ష‌త్రియుల‌ను కూడా త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ… కాపులు మాత్రం శాంతించే ప్ర‌య‌త్నం క‌నిపించ‌డం లేదు. క‌న్నాతో టీడీపీలో జోష్ పెరుగుతుంద‌ని భావించినా.. కాపులు దీనిపై మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

కాపులు వ‌స్తారు.. క‌న్నాను బ‌ల‌ప‌రుస్తార‌నే వ్యూహం చంద్ర‌బాబు కు ఉన్న‌ప్ప‌టికీ.. ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు అయితే.. పార్టీలో క‌నిపించ‌డం లేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యంపై కాపులు.. పార్టీల్లోనూ క‌నిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉంది క‌నుక‌.. ఆదిశ‌గా వారిని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. కానీ, ఏమేర‌కు ఫ‌లిస్తాయనేది చూడాల్సి ఉంటుంది.

This post was last modified on February 21, 2023 1:06 pm

Share

Recent Posts

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

15 minutes ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

19 minutes ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

1 hour ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

1 hour ago

ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం పవన్

2024 ఎన్నికల ముందు నుంచి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదర్చడంలో ఏపీ సీఎం…

2 hours ago

జైలర్‌ 2 అంచనాల బరువు తగ్గిందా

ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…

2 hours ago